Telangana News: వాహనం దిగి హోంగార్డును అభినందించిన హైకోర్టు సీజే జస్టిస్‌ సతీశ్‌చంద్రశర్మ

విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తున్న హోంగార్డును తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ అభినందించారు.

Updated : 08 Apr 2022 16:43 IST

హైదరాబాద్‌: విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తున్న హోంగార్డును తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ అభినందించారు. హోంగార్డుకు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. అష్రాఫ్‌ అలీ అనే హోంగార్డు అబిడ్స్‌ ట్రాఫిక్‌ విభాగంలో హోంగార్డుగా పనిచేస్తున్నారు. బషీర్‌బాగ్‌లోని బాబూ జగ్జీవన్‌ రామ్‌ విగ్రహం కూడలి వద్ద ఆయన విధులు నిర్వహిస్తున్నారు. రోజూ అదే మార్గంలో సీజే జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ రాకపోకలు సాగిస్తుంటారు. 

హోంగార్డు అంకితభావంతో విధులను నిర్వహిస్తూ ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడం సీజేను ఆకట్టుకుంది. దీంతో శుక్రవారం అదే మార్గంలో వెళ్తూ హోంగార్డును చూసి వాహనాన్ని ఆయన ఆపారు. అనంతరం హోంగార్డు అష్రాఫ్‌ అలీకి పుష్పగుచ్ఛం ఇచ్చి అతడి సేవలను అభినందించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ తనను అభినందించడం గర్వంగా ఉందని అష్రాఫ్‌ అలీ ఆనందం వ్యక్తం చేశారు. మరింత ఉత్సాహంగా తన విధులు నిర్వర్తిస్తానని తెలిపారు. హోంగార్డును ట్రాఫిక్‌ విభాగం ఉన్నతాధికారులు అభినందించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని