Andhra News: హైకోర్టుకు చెప్పకుండా ప్రజాప్రతినిధులపై కేసుల ఉపసంహరణా?

ప్రజాప్రతినిధులపై కేసుల ఉపసంహరణను కోర్టు ధిక్కరణగా ఎందుకు పరిగణించకూడదో ప్రభుత్వం

Published : 17 Aug 2022 19:58 IST

అమరావతి: ప్రజాప్రతినిధులపై కేసుల ఉపసంహరణను కోర్టు ధిక్కరణగా ఎందుకు పరిగణించకూడదో ప్రభుత్వం చెప్పాలని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. ఇప్పటి వరకు కోర్టు అనుమతి లేకుండా ఎన్ని కేసులు ఉపసంహరించుకున్నారో చెప్పాలని నిలదీసింది. ప్రజాప్రతినిధుల కేసుల వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా వాదనలు వినిపించిన న్యాయవాది జడ శ్రవణ్‌.. హైకోర్టు అనుమతి లేకుండా కేసులు ఎత్తివేశారని చెప్పారు. ఈ విధానం సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. అనంతరం విచారణను హైకోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని