MLAs Bribery case: ఎమ్మెల్యేలకు ఎర కేసు.. సిట్‌ నోటీసులపై హైకోర్టు స్టే

తెలంగాణ ఎమ్మెల్యేలకు ఎర కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న భాజపా కీలక నేత బీఎల్‌ సంతోష్‌, కేరళ వైద్యుడు జగ్గుస్వామికి హైకోర్టులో ఊరట లభించింది. 

Published : 05 Dec 2022 17:05 IST

హైదరాబాద్: తెలంగాణ ఎమ్మెల్యేలకు ఎర కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న భాజపా కీలక నేత బీఎల్‌ సంతోష్‌, కేరళ వైద్యుడు జగ్గుస్వామికి హైకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) జారీ చేసిన 41ఏ సీఆర్‌పీసీ నోటీసులపై స్టే విధించాలని కోరుతూ వారిద్దరూ ఇటీవల దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం ఈ నెల 13వ తేదీ వరకు సిట్‌ నోటీసులపై స్టే విధించింది. తదుపరి విచారణ వరకు వారిద్దరిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రామచంద్రభారతి, బీడీజెఎస్ అధ్యక్షుడు తుషార్‌కి మధ్యవర్తిగా జగ్గుస్వామి వ్యవహరించినట్లు సిట్ అధికారులు తమ దర్యాప్తులో తేల్చారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు 41ఏ సీఆర్‌పీసీ నోటీసులు జారీ చేశారు. ఈ సెక్షన్‌ ద్వారా నోటీసు జారీచేస్తే.. విచారణకు హాజరైన వ్యక్తిని అరెస్ట్‌ చేసే అవకాశం పోలీసులకు ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని