Published : 23 Jan 2022 01:37 IST

TS news : శిలాఫలకం ధ్వంసం.. ఆత్మకూరులో ఉద్రిక్తత

ఆత్మకూరు: హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం అగ్రం పహాడ్ సమ్మక్క సారలమ్మ జాతర నూతన పాలక మండలి ప్రమాణస్వీకార కార్యక్రమం రసాభాసగా మారింది. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. జాతర ప్రాంగణంలో ఉన్న శిలాఫలకాన్ని తొలగించాలని ఆదేశించారు. దీంతో అక్కడే ఉన్న తెరాస నేత  మోరే మహేందర్‌ గునపంతో ధ్వంసం చేశారు. దీంతో తెరాస, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. 2010లో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌ రావు, ఆయన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం జాతరకు కొంత భూమిని దానం చేశారు. ఆ స్థలంలో ఓ శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. తాజాగా దాన్ని కూల్చివేయడానికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతరం సంఘటన స్థలాన్ని మాజీ మంత్రి కొండా సురేఖ, ఆమె కుమార్తె సుస్మిత పటేల్‌ పరిశీలించారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.


Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని