Published : 10 May 2022 22:07 IST

Andhra News: ‘అసని’ ప్రభావం.. హంసలదీవి వద్ద ఎగసిపడుతున్న అలలు

అవనిగడ్డ: ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో అసని తుపాను ధాటికి తీరప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. తుపాను ప్రభావంతో నియోజకవర్గ వ్యాప్తంగా అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన చిరుజల్లులు పడుతున్నాయి. హంసలదీవి వద్ద అలలు ఎగసిపడుతున్నాయి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అలల ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో హంసలదీవి బీచ్ గేట్లను మెరైన్ పోలీసులు మూసివేశారు. నియోజకవర్గంలోని అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో రెవెన్యూ అధికారులు కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని