AP High court: కాపు రిజర్వేషన్లపై కౌంటర్‌ దాఖలు చేయండి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

కాపులకు 5శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

Updated : 28 Mar 2023 14:20 IST

అమరావతి: కాపులకు 5శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇదే అంశంపై దాఖలైన అన్నీ పిటిషన్లను కలిపి తదుపరి విచారణలో విచారిస్తామని న్యాయస్థానం తెలిపింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేటాయించిన 10% కోటాలో.. కాపులకు 5% రిజర్వేషన్‌ను అమలు చేసేలా ఆదేశాలివ్వాలంటూ కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ మంత్రి హరిరామజోగయ్య హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. 10శాతం రిజర్వేషన్లపై కేంద్రం  ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టులో కేసు విచారణ ముగిసినట్టు పిటిషనర్ తరఫు న్యాయవాది రాధాకృష్ణ కోర్టుకు తెలిపారు. కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉందని రిజర్వేషన్లు ఇవ్వలేమన్న ప్రభుత్వం.. ఇపుడు కేసు విచారణ ముగిసినా ఇవ్వడంలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై ప్రభుత్వ తరఫు న్యాయవాది సందిస్తూ.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని తెలిపారు. పిటిషన్‌పై తదుపరి విచారణను వచ్చే నెల 26కి హైకోర్టు వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు