AP news: పోలవరంపై కీలక చర్చ

పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వ అధికారులతో రాష్ట్ర అధికారుల చర్చలు ముగిశాయి. ప్రాజెక్టులో కొన్ని విభాగాల ఖర్చు పరిమితిపై కీలకంగా

Published : 15 Jun 2021 01:10 IST

అమరావతి: పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వ అధికారులతో రాష్ట్ర అధికారుల చర్చలు ముగిశాయి. ప్రాజెక్టులో కొన్ని విభాగాల ఖర్చు పరిమితిపై కీలకంగా చర్చించినట్లు సమాచారం. కేంద్రం విధిస్తున్న పరిమితుల నుంచి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర అధికారులు కోరారు. సాంకేతిక సలహా కమిటీ సవరించిన అంచనాలకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. డీపీఆర్‌-2ను ఆమోదిస్తే పనులు వేగవంతం అవుతాయని పేర్కొన్నారు. వివిధ అంశాలపై చర్చించినా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. కేవలం అభిప్రాయాల మార్పిడే జరిగిందని రాష్ట్ర అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌, నీటిపారుదలశాఖ కార్యదర్శి, ఈఎన్‌సీ, ప్రాజెక్టు సీఈ హాజరవ్వగా.. కేంద్రం నుంచి జలశక్తిశాఖ సలహాదారు, సీడబ్ల్యూసీ ఛైర్మన్‌, పీపీఏ సీఈవో హాజరయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని