Karnataka results: కర్ణాటక ఫలితాలపై టాప్‌ మీమ్స్‌ ఇవే..

Memes on Karnataka results: కర్ణాటక ఫలితాలపై కొందరు తమ అభిప్రాయాన్ని మీమ్స్‌ ద్వారా తెలియజేశారు. అలా నెట్టింట చక్కర్లు కొడుతున్న మీమ్స్‌ మీకోసం..

Updated : 14 May 2023 03:31 IST
ఇంటర్నెట్‌ డెస్క్‌: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘన విజయం సాధించింది. 136 స్థానాల్లో ఆ పార్టీ గెలుపొందింది. భారతీయ జనతా పార్టీ 65 స్థానాలు గెలుచుకుంది. జేడీఎస్‌ కేవలం 19 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. చాలా ఏళ్ల తర్వాత కన్నడ నాట స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వం కొలువుదీరనుంది. మరోవైపు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా జాతీయ పార్టీలైన భాజపా, కాంగ్రెస్‌ మధ్య జరిగిన ఈ పోరులో ఎవరు గెలుస్తారనేదానిపై ప్రజలు ఉదయం నుంచీ ఆసక్తి కనబరిచారు. ఈ క్రమంలోనే ఫలితాలపై తమ అభిప్రాయాన్ని కొందరు మీమ్స్‌ ద్వారా తెలియజేశారు. ఇక నెక్ట్స్‌ సీఎం ఎవరనే ఫలితం తేలాల్సి ఉందంటూ ఓ వ్యక్తి మీమ్‌ క్రియేట్‌ చేయగా.. మరొకరు గంబీర్‌- కోహ్లీ ఉదంతాన్ని గుర్తు చేసే రాహుల్‌గాంధీ చిత్రాన్ని ట్వీట్‌ చేశారు. అలా నెట్టింట చక్కర్లు కొడుతున్న కొన్ని మీమ్స్‌, సరదా వీడియోలు మీకోసం..







Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని