వారు ఆలయాల సృష్టికర్తలు

అయోధ్యలో సర్వాంగ సుందరంగా.. పలు విశిష్టలతో కూడిన రామమందిర నిర్మాణం సాగనుంది. కాగా ఈ ఆలయ నమూనాను..

Updated : 05 Aug 2020 11:05 IST

15 తరాలుగా ఆలయాల నమూనాలు రూపొందిస్తున్న సోమ్‌పుర కుటుంబం

ఇంటర్నెట్‌ డెస్క్‌: అయోధ్యలో సర్వాంగ సుందరంగా.. పలు విశిష్టలతో కూడిన రామమందిర నిర్మాణం సాగనుంది. కాగా ఈ ఆలయ నమూనాను రూపొందించింది ప్రముఖ ఆర్కిటెక్ట్‌ సోమ్‌పుర. ఆ కుటుంబానిది తరతరాలకు వన్నె తరగని చరిత్ర. 1983లోనే ఆలయ ఆకృతులకు ఒక రూపం ఇచ్చారు. ప్రఖ్యాత సోమ్‌నాథ్‌ ఆలయ నమూనాను కూడా సోమ్‌పుర కుటుంబమే రూపొందించడం విశేషం. అయోధ్య రామాలయ నిర్మాణ బాధ్యతలు కూడా వారికే అప్పగించారు. అయోధ్యలో తలపెట్టిన రామమందిరం నమూనా ఇచ్చింది ఇదే కుటుంబానికి చెందిన 77 ఏళ్ల చంద్రకాంత్ సోమ్‌పుర. 

నాడు సోమ్‌నాథ్‌ అక్షర్‌ధామ్‌.. నేడు అయోధ్య రామమందిరం.. దేశంలోని ఇలాంటి ఎన్నో పుణ్యక్షేత్రాల ఆకృతులు సోమ్‌పుర కుటుంబీకులే రూపొందించారు. ఇలాంటి నిర్మాణాల్లో 15 తరాలుగా ఈ కుటుంబీకుల అద్భుత నైపుణ్యం కనిపిస్తుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన సోమ్‌పుర కుటుంబీకులు దేశవిదేశాల్లో ఇప్పటివరకు 131 ఆలయాలకు నమూనాలు ఇచ్చారు. వీటిల్లో లండన్‌లోని స్వామి నారాయణ్‌ ఆలయం కూడా ఒకటి. అమెరికాలోనూ కొన్ని ఆలయాలకు ఆకృతులు రూపొందించారు.

రామమందిరానికి ఆకృతిని ఇచ్చి సోమ్‌పుర కుటుంబం తమ జన్మను సార్థకం చేసుకున్నట్లుగానే అయోధ్య రాముడికి వస్త్రాలు తయారు చేసి ఒక్కసారిగా భగవత్‌ పహాడి సోదరులు అందరిదృష్టినీ ఆకర్షించారు. అతిపెద్ద ఆలయానికి సంబంధించిన వస్త్రాలను తయారు చేసే పనిని అంతచిన్న దుకాణానికి అప్పగించడం విశేషమే. మరిన్ని విశేషాల కోసం కింది వీడియోను చూడండి..
 

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని