HIV Vaccine: హెచ్ఐవీ టీకా పరిశోధనలో ముందడుగు.. ప్రయోగాల్లో మెరుగైన ఫలితాలు
హెచ్ఐవీని ఎదుర్కొనే వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన పరిశోధకులు.. మానవులపై ముందస్తు ప్రయోగాలు జరుపుతున్నారు. ఇందులో మెరుగైన ఫలితాలు ఇచ్చినట్లు మధ్యంతర నివేదికలో వెల్లడించారు.
వాషింగ్టన్: ఎన్నో దశాబ్దాలుగా యావత్ ప్రపంచానికి సవాలుగా మారిన హెచ్ఐవీ భూతాన్ని తరిమికొట్టేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా వ్యాక్సిన్, ఔషధాల కోసం పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో మానవుల్లో జరిపిన ప్రయోగాత్మక వ్యాక్సిన్ మెరుగైన ఫలితాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. హెచ్ఐవీని ఎదుర్కోవడంలో కీలక ముందడుగు పడినట్లేనని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
హెచ్ఐవీని ఎదుర్కొనే వ్యాక్సిన్‌ను eOD-GT8 60mer పరిశోధకులు అభివృద్ధి చేశారు. మానవుల్లో వ్యాక్సిన్ ముందస్తు ప్రయోగాలకు సంబంధించిన ప్రయోగ ఫలితాలను ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 1న ‘అకాడమిక్ జర్నల్ సైన్స్’లో విడుదల చేశారు. హెచ్ఐవీ ఇన్ఫెక్షన్ను ఎదుర్కొనేందుకు అవసరమైన రోగనిరోధక ప్రతిస్పందనలను ఉత్తేజపరిచే రుజువులు తాజా పరిశోధనలో కనిపించినట్లు అందులో పేర్కొన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న 97శాతం వాలంటీర్లలో ఇది సురక్షితమని తేలిందని చెప్పారు. అంతేకాకుండా కొందరు వాలంటీర్లలో హెచ్ఐవీ వేరియంట్లను తటస్థీకరించే యాంటీబాడీలను ఈ టీకా వృద్ధి చెసినట్లు గుర్తించారు. ఎనిమిది వారాల వ్యవధిలో రెండు డోసుల్లో టీకా ఇచ్చిన అనంతరం ఈ ఫలితాలు వచ్చినట్లు పరిశోధకులు వెల్లడించారు.
ప్రస్తుతం హెచ్ఐవీ ఇన్ఫెక్షన్ను పూర్తిగా నయం చేసే చికిత్స ఏదీ లేదు. కానీ దీన్ని తొలిదశలోనే గుర్తించి ఏఆర్వీ మందులను వేసుకోవటం మొదలెడితే దాదాపుగా వ్యాధి నియంత్రణలో ఉంటుంది. మూడు, నాలుగు ఏఆర్వీ మందులను కలిపి ఇచ్చే పద్ధతి ‘హార్ట్’ (హైలీ ఎఫెక్టివ్ యాంటీ-రెట్రోవైరల్ థెరపీ) బాగా పనిచేస్తుంది. హెచ్ఐవీ సోకిన తొలిదశ నుంచి దీన్ని కచ్చితంగా తీసుకుంటే శరీరంలోని వైరస్ పరీక్షల ద్వారా గుర్తించలేని స్థాయికి పడిపోతుంది. దీంతో చాలావరకు ఆరోగ్యకరమైన జీవితం గడపొచ్చు. అసురక్షిత సంభోగం చేసినా, వీరు వాడిన సూదులను వేరొకరు పంచుకున్నా కూడా వారికి వైరస్ సోకదు.
* హెచ్ఐవీ సోకినవారితో అసురక్షిత సంభోగంలో పాల్గొన్నా కూడా సంభోగానికి ముందుగా తీసుకునే మందులతో నివారించుకోవచ్చు. దీన్ని ప్రెప్ (ప్రి-ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్) అంటారు.
భవిష్యత్ ఆశ
దీర్ఘకాలం పనిచేసే ఏఆర్వీ మందులపై పరిశోధనలు విస్తృతంగా సాగుతున్నాయి. హెచ్ఐవీ నియంత్రణ, నివారణలో ఇవి విప్లవాత్మక మార్పులు తీసుకురాగలవని ఆశిస్తున్నారు. ఈ మందుల్లో ముఖ్యమైనవి కాబోతేగ్రావీర్, రిల్పీవిరిన్ ఇంజెక్షన్ల మిశ్రమం. ఇంకా లెనాకాపావీర్, స్లాట్రోవీర్ ఇంజెక్షన్ ఇంప్లాంట్స్. వీటితో హెచ్ఐవీ చికిత్స చాలా తేలికవుతుంది. సురక్షిత మవుతుంది. వీటిని నెలకో, ఆర్నెల్లకో లేదా ఏడాదికో ఒకసారి తీసుకుంటే సరిపోతుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Mughal Garden: మొగల్ గార్డెన్స్ ఇక.. ‘అమృత్ ఉద్యాన్’
-
Crime News
Crime News: ఆంధ్రప్రదేశ్ పోలీసులమంటూ దోపిడీలు
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (29/01/2023)
-
Sports News
ABD: అంతర్జాతీయంగా ఉన్న సమస్య అదే.. షెడ్యూలింగ్‌పై దృష్టి పెట్టాలి: ఏబీడీ
-
Movies News
Pathaan: రోజుకు రూ. వంద కోట్లు.. ‘పఠాన్’ ఖాతాలో మరో రికార్డు
-
India News
Child Marriage: మైనర్ బాలికతో వివాహం.. యావజ్జీవ కారాగార శిక్షే..!