HMDA: హెచ్‌ఎండీఏ ఈ-వేలానికి ఆదరణ.. తుర్కయాంజిల్‌లో గజం రూ.62,500

హెచ్‌ఎండీఏ ప్లాట్‌ల ఈ-వేలం ప్రక్రియకు మంచి ఆదరణ లభించింది. మొదటి రోజు 85 ప్లాట్లకు వేలం వేయగా 73 ప్లాట్లు అమ్ముడు పోయాయి.

Published : 01 Jul 2022 01:32 IST

హైదరాబాద్‌: హెచ్‌ఎండీఏ ప్లాట్‌ల ఈ-వేలం ప్రక్రియకు మంచి ఆదరణ లభించింది. మొదటి రోజు 85 ప్లాట్లకు వేలం వేయగా 73 ప్లాట్లు అమ్ముడు పోయాయి. తుర్కయాంజిల్‌లో అత్యధికంగా గజం రూ.62,500లు, బహుదూర్‌పల్లిలో అత్యధికంగా గజం రూ.42వేలు ధర పలికింది. ఆన్‌లైన్‌ ద్వారా మొత్తం 85 ప్లాట్లకు జరిగిన ఈ-వేలంలో 73 ప్లాట్లను బిడ్డర్లు కొనుగోలు చేశారు. బహుదూర్‌పల్లి వెంచర్‌లో 51 ప్లాట్లకు గాను 50 ప్లాట్లు వేలంలో అమ్ముడు పోయాయి. ఈ వెంచర్‌లో గజం రూ25,000 ధర నిర్ణయించగా.. అత్యధికంగా రూ.42,500లు పలికింది. అత్యల్పంగా రూ.29,000లకు కొనుగోలుదారులు కోట్‌ చేసి సొంతం చేసుకున్నారు. తుర్కయాంజిల్‌ వెంచర్‌లో 34 ప్లాట్లకు గాను 23 ప్లాట్‌లకు బిడ్‌ చేసి కొనుగోలు చేశారు. ఇక్కడ గజం రూ.40వేలు ధర నిర్ణయించగా.. అత్యధికంగా రూ.62,500, అత్యల్పంగా రూ.40,500ల వరకు అమ్మకాలు జరిగాయి. గురువారం జరిగిన ఈ-వేలం ద్వారా హెచ్‌ఎండీఏకు రూ.137.65 కోట్ల ఆదాయం లభించింది.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని