HMDA: ప్రారంభమైన రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల లాటరీ ప్రక్రియ

బండ్లగూడ, పోచారంలోని రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల అమ్మకానికి భారీ స్పందన లభించిన విషయం తెలిసిందే.

Updated : 27 Jun 2022 11:34 IST

హైదరాబాద్‌: బండ్లగూడ, పోచారంలోని రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల అమ్మకానికి భారీ స్పందన లభించిన విషయం తెలిసిందే. ఈ ఫ్లాట్ల విక్రయానికి హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) నోటిఫికేషన్‌ ఇవ్వగా.. ఇవాళ ఉదయం 9 గంటలకు లాటరీ ప్రక్రియను ప్రారంభించారు. బండ్లగూడలోని 2,246 ఫ్లాట్ల కొనుగోలు కోసం 33,161 దరఖాస్తులు రాగా.. పోచారంలోని 1,470 ఫ్లాట్ల కోసం 5,921 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుదారులకు లాటరీ పద్ధతిలో ఇవాళ ఫ్లాట్లను కేటాయించనున్నారు. అత్యధికంగా బండ్లగూడలోని 345 త్రిబుల్ బెడ్ రూం డీలక్స్ ఫ్లాట్ల కోసం 16,679 మంది దరఖాస్తు చేసుకున్నారు. లాటరీ ప్రక్రియను ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌లలో లైవ్‌స్ట్రీమింగ్‌కు ఏర్పాట్లు చేశారు. ఒక వ్యక్తికి ఒక ఫ్లాట్‌ మాత్రమే కేటాయిస్తామని అధికారులు వెల్లడించారు. ఆధార్‌ సంఖ్యను ఇందుకు ప్రాతిపదికగా తీసుకోనున్నట్లు హెచ్‌ఎండీఏ అధికారులు వెల్లడించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని