Nizamabad: తెలంగాణ వర్సిటీ హాస్టళ్లకు సెలవులు.. రద్దు చేయాలని విద్యార్థుల డిమాండ్

తెలంగాణ వర్సిటీ హాస్టళ్లకు వీసీ రవీందర్‌ గుప్త సెలవులు ప్రకటించారు. జూన్‌ 1 నుంచి 9వ తేదీ వరకు హాస్టళ్లను మూసివేస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చారు.

Updated : 31 May 2023 22:06 IST

నిజామాబాద్‌: తెలంగాణ వర్సిటీ హాస్టళ్లకు వీసీ రవీందర్‌ గుప్త సెలవులు ప్రకటించారు. జూన్‌ 1 నుంచి 9వ తేదీ వరకు హాస్టళ్లను మూసివేస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చారు. వసతి గృహాల మరమ్మతుల కోసమే సెలవులు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జూన్‌ 1న మధ్యాహ్నం తర్వాత హాస్టళ్లను ఖాళీ చేయాలన్నారు. ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని ప్రొఫెసర్లకు ఆదేశాలు జారీ చేశారు. అయితే, వర్సిటీకి సెలవులు ఇవ్వడాన్ని విద్యార్థులు ఖండిస్తున్నారు. వెంటనే సెలవులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని