Andhra News: ప్రజలకు హాని కలిగించే పరిశ్రమలను ప్రభుత్వం ప్రోత్సహించదు: హోంమంత్రి వనిత

ప్రజలకు హానికలిగించే పరిశ్రమలను ప్రభుత్వం ప్రోత్సహించదని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్‌ రసాయన పరిశ్రమలో జరిగిన  ఘటనపై సీఎం జగన్‌ స్పందించి, పరిశ్రమను సీజ్‌ చేయటానికి ఆదేశాలు ఇచ్చినట్టు తెలిపారు.

Updated : 14 Apr 2022 17:15 IST

విజయవాడ: ప్రజలకు హానికలిగించే పరిశ్రమలను ప్రభుత్వం ప్రోత్సహించదని రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్‌ రసాయన పరిశ్రమలో జరిగిన  ఘటనపై సీఎం జగన్‌ స్పందించి, పరిశ్రమను సీజ్‌ చేయటానికి ఆదేశాలు ఇచ్చినట్టు తెలిపారు. విజయవాడ గొల్లపూడిలో ఉన్న ఆంధ్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను హోం మంత్రి పరామర్శించారు. మొత్తం 11 మందిలో నలుగురికి 50శాతం కన్నా తక్కువ గాయాలు కాగా, మరో ఆరుగురికి 50శాతం కన్నా ఎక్కువ గాయాలైనట్టు పేర్కొన్నారు. ఒకరికి 90శాతంపైగా శరీరం కాలిపోయినట్టు వెల్లడించారు. మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుంచి రూ.25లక్షలు, పరిశ్రమ నుంచి రూ.25లక్షలు సాయం అందిస్తున్నట్టు వివరించారు. గాయపడిన వారికి రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించినట్టు హోంమంత్రి తెలిపారు. పరిశ్రమ నుంచి లీకేజీల వల్ల అక్కడి ప్రజలకు సమస్య ఉన్నట్టు గ్రామస్థులు తెలిపారని మంత్రి పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు