ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? 03-04-2022
ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? 03-04-2022
- డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్
ప్రారంభించిన పనుల్లో విఘ్నాలు పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. ముఖ్య విషయాల్లో అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. అధికారుల సహకారం ఉంటుంది. శివ స్తోత్రం చదవడం మంచిది.
ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. ఆపదలు కలుగకుండా చూసుకోవాలి. శ్రమకు తగిన గుర్తింపు దక్కడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది. విష్ణుసహస్ర నామ పారాయణ శుభప్రదం.
మంచి కాలం. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాల్లో లాభదాయకమైన ఫలితాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధు,మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఈశ్వర దర్శనం మంచిది.
శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. బంధు,మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన పనులను త్వరగా పూర్తయ్యేలా ప్రణాళికను సిద్ధం చేయండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆదిత్యహృదయ చదవడం మంచిది.
మనోబలంతో చేసే పనులు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దత్తాత్రేయుడిని ఆరాధించడం మంచిది.
మధ్యమ ఫలితాలు ఉన్నాయి. మీ మీ రంగాల్లో శ్రద్ధగా పనిచేయాలి. అందరినీ కలుపుకొనిపోవడం వల్ల సమస్యలు తగ్గుతాయి. శ్రమ అధికం అవుతుంది. సమాచారలోపం లేకుండా చూసుకోవాలి. ఆవేశాలకు పోకూడదు. గోవిందనామాలు చదివితే మంచి జరుగుతుంది.
శుభ కాలం. కొన్నివ్యవహారాలలో స్థిరమైన బుద్ధితో వ్యవహరించి మంచి ఫలితాలను అందుకుంటారు. వ్యాపారంలో లాభదాయక ఫలితాలు ఉంటాయి. సకాలంలో సహాయం చేసేవారు ఉన్నారు. శివారాధన మంచిది.
మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ఒక సమస్య మానసిక ప్రశాంతతను తగ్గిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త బాధ కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం మంచిది.
మీ మీ రంగాల్లో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. మీ అధికార పరిధి పెరుగుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగి అందరి మన్ననలు అందుకుంటారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఈశ్వరాభిషేకం శుభాలను చేకూరుస్తుంది.
అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆర్ధికంగా జాగ్రత్తలు అవసరం. నూతన వస్తువులను కొంటారు. మీ అధికార పరిధి పెరుగుతుంది. లక్ష్మీగణపతి ఆరాధన శుభప్రదం.
విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది. భవిష్యత్తు ప్రణాళికలు కొన్ని అమలు చేయగలుగుతారు. సొంతింటి పనుల్లో ముందడుగు వేయగలుగుతారు. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. దుర్గారాధన శుభప్రదం.
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో మీకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. పట్టుదల వదలకండి. కలహ సూచన. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. దక్షిణామూర్తి స్తోత్రం చదివితే మంచిది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..