TSPSC: ఈనెల 11నుంచి అందుబాటులోకి హార్టీకల్చర్‌ హాల్‌టికెట్లు

హార్టీకల్చర్‌ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను రేపటి నుంచి డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు టీఎస్‌పీఎస్సీ అనుమతించింది.

Published : 10 Jun 2023 20:54 IST

హైదరాబాద్‌: ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో వాయిదా పడిన హార్టీకల్చర్‌ ఆఫీసర్‌ పరీక్షను ఈ నెల 17న నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 11వ తేదీ (ఆదివారం) నుంచి అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు టీఎస్‌పీఎస్సీ అనుమతించింది. ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచుతామని ఓ ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా అభ్యర్థులు ప్రాక్టీస్‌ కోసం మాక్‌టెస్ట్‌ లింకును కూడా అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని