Updated : 29 Mar 2022 16:08 IST

Hydearabad: ఆసుపత్రుల్లో ఆహార, పారిశుద్ధ్య కాంట్రాక్టుల్లో ఎస్సీలకు 16 శాతం కేటాయింపు

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీల సంక్షేమానికి కృషి చేస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆహార, పారిశుద్ధ్య కాంట్రాక్లుల్లో ఎస్సీలకు 16 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తున్నామన్నారు. రాష్ట్రంలో మొత్తం 122 ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయని.. అందులో 56 చోట్ల ఎస్సీ గుత్తేదారులను ప్రోత్సహిస్తున్నామన్నారు. ఇప్పటికే జలవనరులు (ఇరిగేషన్‌), అబ్కారీ (ఎక్సైజ్‌)శాఖల్లో రిజర్వేషన్‌ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. దళిత బందు నగదు ఇచ్చి ఊరికే విడిచిపెట్టడం కాదని.. వారి కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి గల ప్రణాళికలు తయారు చేసుకోవాలని సూచించారు. అందుకు అవసరమైన సహాయ, సహకారాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అనంతరం ఎస్సీలకు కేటాయించిన ఆసుపత్రుల వివరాలను లాటరీ తీసి  ప్రకటించారు. ఈ ఒక్క లాటరీ స్లిప్పు ఒక్కో జీవితాన్ని మార్చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts