ఏసీతో కరోనా వ్యాప్తి ఎలా అంటే..

వెంటిలేషన్‌, ఎయిర్‌ కండిషనింగ్‌ కరోనా వైరస్‌ వ్యాప్తిని ఎలా ప్రభావితం చేస్తాయన్న అంశంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు. ఇందులో భాగంగా చైనాలోని ఒక రెస్టారెంటులో ఈ పరిశోధనలు నిర్వహించారు.

Published : 10 Feb 2021 19:59 IST

దిల్లీ: వెంటిలేషన్‌, ఎయిర్‌ కండిషనింగ్‌ కరోనా వైరస్‌ వ్యాప్తిని ఎలా ప్రభావితం చేస్తాయన్న అంశంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు. ఇందులో భాగంగా చైనాలోని ఒక రెస్టారెంటులో ఈ పరిశోధనలు నిర్వహించారు. వీటిని పరిశీలించేందుకు సూపర్‌ కంప్యుటర్లలో ఆధునాతన వాయు ప్రవాహ ఉత్పత్తులను వినియోగించినట్లు వారు తెలిపారు. ఈ పరిశోధనకు సంబంధించిన పత్రాలు తాజాగా ఫిజిక్స్‌ ఆఫ్‌ ఫ్లూయిడ్స్‌ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఎయిర్‌ కండిషనర్ల నుంచి వచ్చే చల్లటి గాలి ప్రవాహం ఆ గదిలో ఉన్న వేడి పదార్థాల నుంచి వచ్చే ఆవిరితో కలిసినపుడు జరిగే చర్యలు, ఈ ప్రక్రియలో కరోనా వైరస్‌ కణాలు ఏ విధంగా వ్యాపిస్తున్నాయి అనే అంశాలను ఈ పరిశోధనలో విశ్లేషించారు. ‘‘ మా పరిశోధనలో గాలి ప్రవాహం, వేడి ప్రభావం, ఎయిర్‌ కండీషనర్ల సామర్థ్యం, ఏరోసోల్‌ వ్యాప్తి వంటి భౌతిక చర్యలతో పాటు వైరస్‌ వ్యాప్తికి ఉపకరించే అన్ని అంశాలను పరిశీలించాం.’’ అని ఈ పరిశోధనలో సభ్యుడైన జియారోంగ్‌ హాంగ్‌ తెలిపారు.

ప్రస్తుతం కరోనా వైరస్‌ గాలిలో ఎలా వ్యాప్తి చెందుతుందన్న అంశంపై అనేక అధ్యయనాలు నిర్వహిస్తున్నారు. వారు కంప్యూటర్‌ అనుకరణలను అనుసరించి ప్రయోగాలు చేయగా తాము కాంట్రాక్ట్‌ ట్రేసింగ్‌ ద్వారా ప్రత్యక్షంగా వాస్తవ సంక్రమణ వ్యాప్తిని పరిశీలించామని హాంగ్‌ తెలిపారు. మా పరిశోధనలో అధునాతన గణన సాధనాలు ఏరోసోల్‌ వ్యాప్తి, వివిధ భౌతిక కారకాలను వాస్తవికంగా విశ్లేషించాయి అని ఆయన వెల్లడించారు. రెస్టారెంట్లలో వైరస్‌ ఎక్కువగా వ్యాప్తి చెందే ప్రాంతాలు, నమోదైన కరోనా సంక్రమణ నమూనాల మధ్య ప్రత్యక్ష అనుసంధానం ఉన్నట్లు వారు పేర్కొన్నారు. తమ పరిశోధన ద్వారా రెస్టారంట్లలో వైరస్‌ కణాలు రెండు రకాలుగా వ్యాపిస్తున్నట్లు గుర్తించామని వారు తెలిపారు. అందులో ఒకటి బల్లల కింద నుంచి ప్రసరించే ఏరోసోల్‌ కణాలు పెరగడం, రెండోది ఏసీల ద్వారా అని వెల్లడించారు.
‘‘మా పరిశోధన ద్వారా కరోనా వ్యాప్తి నివారణకు రెండు చర్యలను సూచిస్తున్నాం. ఒకటి బల్లలను కింది వరకూ కప్పి ఉంచడం, రెండోది ఏసీ వడపోత సామర్థ్యాల్ని పెంచడం. గాలి ద్వారా వైరస్‌ వ్యాపించే ప్రమాదాన్ని అంచనా వేయడం మా పరిశోధనలో కీలకాంశం.’’ అని పరిశోధకులు వెల్లడించారు.

ఇవీ చదవండి..

స్నేహితుడిని కలవడానికి వెళ్తే కోటి లాటరీ..

కరోనా జీవాయుధం కాకపోవచ్చు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని