Covid-19: గుండెపై కరోనా ప్రభావం ఎలా అంటే..?

మానవుల్లో ప్రధాన అవయవం అయిన గుండెపై కరోనా వైరస్‌ తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. ఈ వైరస్‌ గుండె లోపలి కణాలపై దాడి చేసి వాటిని నాశనం చేస్తున్నాయని తెలిపారు. వాషింగ్టన్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌

Updated : 21 Feb 2022 12:10 IST

వాషింగ్టన్‌: మానవుల్లో ప్రధాన అవయవం అయిన గుండెపై కరోనా వైరస్‌ తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. ఈ వైరస్‌ గుండె లోపలి కణాలపై దాడి చేసి వాటిని నాశనం చేస్తున్నాయని తెలిపారు. వాషింగ్టన్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ పరిశోధకులు అమెరికన్‌ కాలేజ్‌ ఆఫ్‌ కార్డియాలజీ జర్నల్‌లో గత ఏడాది ఈ వివరాలు ప్రచురించారు. కరోనా సోకిన తర్వాత చాలా మందికి గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతుండటంతో పరిశోధకులు ఈ విషయంపై దృష్టి పెట్టారు. కరోనా వైరస్‌ గుండె లోపలి కణాలపై దాడి చేసి చంపేయడంతో దాని ప్రభావం గుండె సంకోచ వ్యాకోచాలపై పడుతున్నట్లు వారు గుర్తించినట్లు తెలిపారు. సాధారంగా ఇలాంటి పరిస్థితుల్లో గుండెలో మంట వస్తుంది. కానీ కరోనా కారణంగా ఈ సమస్య ఎదురైతే మంట వంటి లక్షణాలు కూడా కనిపించట్లేదని పరిశోధనలో పాల్గొన్న కోరీ జె లావినె తెలిపారు.

కరోనా వైరస్‌ ప్రధానంగా గుండె లోపలి కణాలతో పాటు, రోగ నిరోధక వ్యవస్థలోని టి, బి కణాలపై దాడి చేస్తుందన్నారు. ఇతర వైరస్‌లతో పోలిస్తే కరోనా దాడి చేయడం వల్ల గుండె భిన్నంగా ప్రతిస్పందిస్తున్నట్లు గమనించినట్లు తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు కరోనా ప్రభావం నుంచి పూర్తిగా కోలుకోవడానికి చాలా సమయం పడుతోందని పరిశోధకులు పేర్కొన్నారు. యువకుల్లో వారు చేసే శారీరక శ్రమ ఆధారంగా లక్షణాల్లో స్వల్ప మార్పులుంటాయని తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు