Health Tips:అధిక రక్తపోటుతో కిడ్నీలకు ముప్పు..నివారణ ఎలాగో తెలుసా..?

అధిక రక్తపోటు కిడ్నీలకు ముప్పు తెచ్చిపెడుతుంది. అదుపు తప్పే రక్తపోటు కిడ్నీలను ఇరుకున పడేస్తుంది. ఇప్పటికే కిడ్నీ జబ్బుతో బాధ పడేవారు మరింత అప్రమత్తంగా ఉండాలి

Published : 03 Jul 2022 01:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అధిక రక్తపోటు కిడ్నీలకు ముప్పు తెచ్చిపెడుతుంది. అదుపు తప్పే రక్తపోటు కిడ్నీలను ఇరుకున పడేస్తుంది. ఇప్పటికే కిడ్నీ జబ్బుతో బాధ పడేవారు మరింత అప్రమత్తంగా ఉండాలి. అధిక రక్తపోటు పెరుగుతున్న కొద్దీ ప్రాణాంతకంగా మారుతుందని నెఫ్రాలజిస్ట్‌ విజయ్‌వర్మ సూచించారు.

* బీపీని ఎలా చెబుతారంటే.. సిస్టాలిక్‌ బీపీ వాల్యూ,పైన ఉంటుంది.. డయాస్టాలిక్‌ బీపీ వాల్యూ కింద ఉంటుంది. ఇది సాధారణంగా 120/80 ఉంటుంది. కానీ 140/90 కంటే ఎక్కువగా ఉంటే అధిక రక్తపోటు బారిన పడ్డట్టే. ఇది కూడా ఉదయం పరగడుపున చెక్‌ చేయించుకోవాలి. అప్పుడే ఖచ్చితమైన బీపీ ఎంతుందో తెలుస్తుంది.

* అధిక రక్తపోటు ఉంటే కిడ్నీలు సరఫరా చేసే రక్త నాళాలు దెబ్బతినే అవకాశం ఉంది. దీంతోనే కిడ్నీ కూడా దెబ్బతింటుంది. 

* చాలా మందికి కిడ్నీలు పాడయినట్టు కూడా తెలియదు. 80 నుంచి 90 శాతం కిడ్నీ పాడయినా ఎలాంటి లక్షణాలు కనిపించవు. ఒకసారి కిడ్నీలు పాడయిన తర్వాత చాలా సమస్యలు వస్తాయి. కాళ్లలో వాపు వస్తుంది. రక్తపోటు అధికంగా ఉంటుంది. హిమోగ్లోబిన్‌ తగ్గిపోతుంది. లైంగిక సామర్థ్యం తగ్గిపోతుంది. ఆకలి ఉండదు. వాంతులు తరచుగా అవుతాయి. 

* అధిక రక్తపోటు వచ్చిన వ్యక్తులు తరచుగా పరీక్షలు చేయించుకోవాలి. ఉప్పు శత్రువు లాంటిది. దీన్ని పూర్తిగా తగ్గించుకోవాలి. నొప్పి మాత్రలు అధిక రక్తపోటు ఉన్న వారు వాడొద్దు. వైద్యుల అనుమతి లేకుండా వాడితే చాలా సమస్యలు వస్తాయి.

* అధిక రక్తపోటును తగ్గించే మందులను క్రమం తప్పకుండా వాడాలి. ప్రతి రోజూ ఉదయం మాత్ర వేసుకోవాలి. మరీ అధికంగా రక్తపోటు ఉంటే వైద్యుల పర్యవేక్షణలో రోజుకు రెండుపూటలా మందులు వేసుకోవాలి. ఇలాయితే కిడ్నీలను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని