Medicines: మందులు వేసుకుంటున్నారా..? మీ కిడ్నీలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి

మనం వేసుకునే మందులు అనారోగ్యాన్ని పారదోలాలి. ఉత్సాహం, ఉల్లాసంగా ఉంచాలి. కానీ ఆ మందులే ఇపుడు సమస్యగా మారుతున్నాయి. లేనిపోని జబ్బులను తెస్తున్నాయి. కిడ్నీలను ప్రమాదంలో పడేస్తున్నాయి. యాంటీబయోటిక్స్‌, షుగర్‌, బీపీ, ఒళ్లునొప్పుల మందులు కిడ్నీలకు ముప్పుగా మారుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.

Published : 25 Sep 2022 14:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మనం వేసుకునే మందులు అనారోగ్యాన్ని పారదోలాలి. ఉత్సాహం, ఉల్లాసంగా ఉంచాలి. కానీ ఆ మందులే ఇపుడు సమస్యగా మారుతున్నాయి. లేనిపోని జబ్బులను తెస్తున్నాయి. కిడ్నీలను ప్రమాదంలో పడేస్తున్నాయి. యాంటీబయోటిక్స్‌, షుగర్‌, బీపీ, ఒళ్లునొప్పుల మందులు కిడ్నీలకు ముప్పుగా మారుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. నిత్యం వాడే మందులతో ఉండే ఇబ్బందుల గురించి నెఫ్రాలజిస్టు డాక్టర్‌ శ్రీ భూషణ్‌రాజు వివరించారు.

సొంత వైద్యంతోనే...

చాలా మంది చిన్న చిన్న సమస్యలకు వైద్యుల దాకా ఎందుకని మందుల దుకాణంలో కొనుక్కొని మింగేస్తారు. గతంలో ఉన్న సమస్య మళ్లీ వచ్చినపుడు పాత చిటీలోని మందులను కొని వేసుకుంటారు. మనం వినియోగించే ప్రతి మందు బిళ్ల శరీరంలోని ఏదో ఒక అవయవంపై ప్రభావం చూపుతుంది. నొప్పికి మందులు వాడటంతో కిడ్నీలు తొందరగా సమస్యల్లో పడుతాయి. మితిమీరి తీసుకోవద్దు. కొన్నిసార్లు పారాసిటామాల్‌తో ఇబ్బందులు రావొచ్చు. ఇది కాలేయంపై ప్రభావం చూపుతుంది. అంటాసిడ్‌ మాత్రలు ఎక్కువగా వాడటం మంచిది కాదు. యాంటీబయోటిక్స్‌ అన్ని రకాల జబ్బులకు వినియోగించవద్దు. వైద్యుల సూచనలతోనే వాడాలి. లేకపోతే కిడ్నీలను కాపాడుకోవడం కష్టంగా మారుతుంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని