కొవిడ్‌పై ఊబకాయ భారం?

మధ్య వయస్సు వారు..40 కంటే తక్కువ ఉన్నవారు ఇదే ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు

Published : 05 Jun 2021 01:20 IST

డా.చంద్రశేఖర్‌ పులి, గ్యాస్ర్టోఎంటరాలజిస్ట్‌

కరోనా వేళ మన ఒంటి బరువే మనకు ముప్పుగా మారొచ్చని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. అధిక బరువు, స్థూలకాయంతో బాధపడేవారికి మిగతావారితో పోలిస్తే వైరస్‌ సోకే ముప్పు అధికంగా ఉంటున్నట్లు అనేక అధ్యయనాల్లో తేలింది. అంతేకాదు బరువు ఎక్కువ ఉన్న వారిలో కరోనా ఇన్ఫెక్షన్ల మూలంగా సమస్యల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా ఆసుపత్రుల్లో చేరాల్సి రావడం.. ప్రాణవాయువు కొరత వంటి ఇబ్బందులు ఉంటున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో స్థూలకాయులకు కరోనాతో పొంచి ఉన్న ముప్పు గురించి తెలుసుకుందాం!

* లావుగా ఉండే రోగులు అంటే ఒబెసీ పేషెంట్లకు కొవిడ్‌ ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్‌ తీవ్రత చాలా ఎక్కువే. దీన్నుంచి వీరికి ఎందుకు త్రీవంగా వచ్చిందని పరిశీలిస్తే... ఒకటి లావుగా ఉండే రోగులు కచ్చితంగా కొవిడ్ రోగులు అయ్యి ఉంటారు. రెండు.. హిస్టారిక్‌గా చూసుకుంటే వీరికి నిమోనియా రావడం కానీ ఇన్‌ఫ్లూఎంజా ఇన్ఫెక్షన్‌ వచ్చిన వాళ్లకి కానీ.. వారికి ఇన్‌క్యుబేషన్‌ అయ్యే అవకాశాలు ఎక్కుంటాయి. ముఖ్యంగా వీరిపై కొవిడ్‌ ప్రభావం అధికంగా ఉంటుంది.

* బాగా సన్నగా ఉన్న వ్యక్తులుగానీ.. అంటే బీఎంఐ 18 కన్నా తక్కువగా ఉన్నట్లైతే.. హవర్స్‌ రేషియో ఆఫ్‌ కొవిడ్‌ ఇన్ఫెక్షన్‌ కానీ దాన్నుంచి చనిపోయే కారణాలు కానీ దాదాపు 1.44 శాతమే. అలాగే సాధారణ బీఎంఐ 20-24.. 29ని క్లాస్‌వన్‌ ఒబెసిటీ అంటారు. వాళ్లకి బతికే అవకాశాలు బాగానే ఉంటాయి.

* ఇక క్లాస్‌ టూ (30-35-40) వరకు వచ్చే రోగులకు, 40 పైనా (సూపర్‌ ఒబీస్‌) వీరిని కాపాడటమేది చాలా కష్టం ఎందుకంటే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు, ఆక్సిజన్‌ రిక్వైర్మెంట్‌ చాలా చాలా కష్టంగా ఉంటుంది. చిన్నపిల్లల్లో కూడా లావుగా ఉంటే వాళ్ల హాస్పటలైజేషన్‌, వాళ్లకి కావాల్సిన ఆక్సిజన్‌, వెంటిలేషన్‌ రిక్వెర్‌మెంట్స్‌ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. దీన్నే చైల్డ్‌ హుడ్‌ ఓబెసిటీ అంటాం.

* చిన్నపిల్లల్లో లావుగా ఉన్నవారికి కరోనా వైరస్‌ వస్తే వాళ్లు కూడా సిక్‌ ఉంటారు. మధ్య వయస్సు వారు..40 కంటే తక్కువ ఉన్నవారు ఇదే ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని