Pain Killers: నొప్పి నివారిణులతో చేటు తప్పదా? ఎందుకో తెలుసుకోండి..!

నొప్పి ఏదైనా కావొచ్చు..తగ్గించుకోవడానికి చాలా మంది మాత్రలను ఆశ్రయిస్తారు. కాళ్లు, కీళ్ల నొప్పులు వస్తున్నాయని కొంతమంది దీర్ఘకాలంగా మందులను ఎడాపెడా మింగేస్తారు. 

Published : 16 Oct 2022 10:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నొప్పి ఏదైనా కావొచ్చు.. తగ్గించుకోవడానికి చాలా మంది మాత్రలను ఆశ్రయిస్తారు. కాళ్లు, కీళ్ల నొప్పులు వస్తున్నాయని కొంతమంది దీర్ఘకాలంగా మందులను ఎడాపెడా మింగేస్తారు. వాటి పర్యవసానం ఏంటో తెలుసుకునే ఓపిక ఉండదు.. కానీ, ఇవి ఆరోగ్యానికి ఎంతో చేటు చేస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కిడ్నీలను దెబ్బతీయడమే  కాకుండా గుండెపైనా ప్రభావం చూపుతాయని ప్రముఖ జనరల్‌ ఫిజిషియన్‌ డాక్టర్‌ వై.పూజిత తెలిపారు. 

ఎప్పుడు అవసరమంటే...

నొప్పి నివారిణులను ఆపరేషన్‌ సమయంలోనూ, అత్యవసర సమయంలో మాత్రమే వాడాలి. అది కూడా వైద్యుల సలహాతోనే తీసుకోవాలి. కొన్నిరకాల పెయిన్‌కిల్లర్స్‌ మెదడుపై ప్రభావం చూపిస్తాయి. నొప్పి తగ్గాలంటే సాధారణంగా పారాసిటమాల్‌ వాడితే చాలా మంచిది. దీనితో ఎలాంటి సైడ్‌ ఎఫెక్టు ఉండదు. ఇతర పెయిన్‌ కిల్లర్లతో అల్సర్లు వస్తాయి. రక్తస్రావం కూడా అవుతుంది. కిడ్నీలు దెబ్బతింటాయి. గుండె సంబంధమైన సమస్యలూ వస్తాయి. ఎముకలు విరిగిపోతాయి. చర్మంపై దద్దుర్లు కూడా వస్తాయి. ప్రతి రోజు కాకుండా వారానికొకటి వేసుకుంటే పెద్దగా ఇబ్బందులు రావు. ఏ మందులైనా వైద్యుల సూచనలతోనే వేసుకోవాల్సిందే..!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని