Triglycerides: ట్రైగ్లిజరైడ్ కొవ్వులను కరిగించేదెలా అని చింతించొద్దు!
కొలస్ట్రాల్ చాలా జబ్బులకు కారణమవుతుంది. ఇందులో మంచి కొలస్ట్రాల్, చెడు కొలస్ట్రాల్ రెండూ ఉంటాయి. అయితే చెడు కొలస్ట్రాన్ను తగ్గించుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలో తెలియక చాలా మంది మదన పడుతుంటారు.
ఇంటర్నెట్ డెస్క్: కొలెస్ట్రాల్ చాలా జబ్బులకు కారణమవుతుంది. ఇందులో మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ రెండూ ఉంటాయి. అయితే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. వీటితో పాటు ట్రైగ్లిజరైడ్ కొవ్వులను పెద్దగా పట్టించుకోం. ఇది చాలా ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. ఆహార జాగ్రత్తలు తీసుకుంటూ మందులు వాడితే ఫలితం బాగానే ఉంటోంది. ఈ ట్రైగ్లిజరైడ్లను తగ్గించుకునే మార్గాలను వైద్యులు సూచించారు.
ట్రైగ్లిజరైడ్లు అంటే..
చెడు కొవ్వుతో పాటు ట్రైగ్లిజరైడ్ కూడా హానికారక కొవ్వే. ఇది రక్తంలో ఎక్కువగా ఉంటే ప్రమాదకరమే. రక్తంలో అధికంగా ఇవి ఉండటంతో గుండెకు ఇబ్బందులు వస్తున్నాయి. గుండె జబ్బులున్న వారిలో కొలెస్ట్రాల్ సాధారణంగా ఉన్నా.. ట్రైగ్లిజరైడ్ అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇవి జీవక్రియల వేగాన్ని మందగించేలా చేస్తాయి. వీటితో రక్త నాళాల గోడలు దెబ్బతింటాయి. రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ ముద్దలుగా పేరుకొని పొతుంది. గుండె జబ్బులకు కారణమవుతుంది.
ఏం చేస్తే మంచిది
* లావుగా ఉన్న వారు బరువు తగ్గాలి. మద్యం, దూమపానం చేస్తే ట్రైగ్లిజరైడ్ స్థాయిలు పెరుగుతాయి.
* కొవ్వు శాతం ఎక్కువగా ఉండే మాంసం తినొద్దు. అన్ని రకాల నూనెలు, కొవ్వు పదార్థాలు తగ్గించాలి.
* తేలికగా జీర్ణమయ్యే పిండి పదార్థాలతో ట్రైగ్లిజరైడ్లు పెరుగుతాయి.
* వివిధ వ్యాపార సముదాయాల్లో లభించే ఆహార పదార్థాలు, పిజ్జాలు, బర్గర్, నుడుల్స్, చిప్స్ తినొద్దు.
* రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు వంటి తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవడం మంచిది.
* చక్కెర, జామ్, జెల్లీలు ఎక్కువగా తినే వారికి ట్రైగ్లిజరైడ్లు పెరుగుతాయి. కూల్ డ్రింకులు మానేయడం మరీ మంచిది.
* మధుమేహులు వీటి స్తాయిలు ఎక్కువగా ఉన్నాయో పరిశీలించాలి. తప్పనిసరిగా తగ్గించుకోవాలి. గ్లూకోజ్ సమర్థంగా నియంత్రణలో ఉంచుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
-
కంగనపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సుప్రియా శ్రీనేత్‌కు కాంగ్రెస్ షాక్!
-
ఉపాధి కూలీల కనీస వేతనం రూ.300
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,186
-
క్రికెట్ అభిమానులకు నో టికెట్.. సోషల్ మీడియాలో ‘బేరసారాలు’
-
కసబ్‌ను పట్టుకున్న సదానంద్ దాతెకు ఎన్ఐఏ పగ్గాలు