Facebook: మీ పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతానా?

ఇటీవల కాలంలో నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాల బెడద ఎక్కువైంది. ఒకరి పేరుతో ఫేస్‌బుక్‌ ఖాతా ఏర్పాటు చేయడం.. అతడి ఫ్రెండ్స్‌ లిస్ట్‌లో ఉన్న వారికి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపడం...

Updated : 30 May 2021 20:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇటీవల కాలంలో నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాల బెడద ఎక్కువైంది. ఒకరి పేరుతో, మరొకరు ఫేస్‌బుక్‌ ఖాతా తెరిచి.. ఒరిజినల్‌ అకౌంట్‌లో ఫ్రెండ్స్‌ లిస్ట్‌లో ఉన్న వారికి కొత్తగా ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపిస్తున్నారు. తీరా రిక్వెస్ట్‌ యాక్సెప్ట్‌ చేశాక అత్యవసరం పేరుతో డబ్బులు అడగడం ఈ మధ్య ఎక్కువైంది. కరోనా వేళ నిజంగానే అవతలి వ్యక్తికి డబ్బులు అవసరం అనుకుని కొందరు పంపించి మోసపోతున్నారు. ఈ విషయం అసలు ఖాతా కలిగిన వ్యక్తికి ఆలస్యంగా చేరుతోంది. నకిలీ ఖాతా గురించి తన ఫ్రెండ్స్‌ను అలెర్ట్‌ చేస్తున్నారు. దీంతో పాటు నకిలీ ఖాతాను తొలగించడానికి సైబర్‌ పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

కానీ, పోలీసుల అవసరం లేకుండానే నకిలీ ఖాతాల పని పట్టొచ్చని అంటున్నారు తెలంగాణ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు. ఫేస్‌బుక్‌కు రిపోర్ట్‌ చేయడం ద్వారా నకిలీ ఖాతాలను తొలగించొచ్చని చెబుతున్నారు. ఇందుకోసం ముందుగా.. మీరు గుర్తించిన ఫేస్‌బుక్‌ నకిలీ ఖాతాకు కుడివైపు ఉన్న మూడు చుక్కల మెనూను ఓపెన్‌ చేయాలి. అందులో రిపోర్ట్‌ అనే సెక్షన్‌లో ఫేక్‌ అకౌంట్‌ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత యాప్‌/వెబ్‌సైట్‌ సూచనల ప్రకారం రిపోర్టు ప్రక్రియ పూర్తి చేయాలి. ఇలా ఓ 20 మంది స్నేహితుల చేత రిపోర్ట్‌ చేయించాలి. దీంతో ఫేస్‌బుక్‌ సంస్థే స్వయంగా పరిశీలించి నకిలీ ఖాతాను తొలగిస్తుందని తెలంగాణ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చెబుతున్నారు. ఈ విషయాన్ని మీ స్నేహితులకూ తెలియజేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని