Published : 16 Apr 2022 01:59 IST

EPFO: రూ. 7లక్షల బీమా పొందాలా?.. ఈ- నామినేషన్‌కు ఇలా దరఖాస్తు చేయండి

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉద్యోగ భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) తమ చందాదారుల కోసం ఎంప్లాయీస్‌ డిపాజిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ (ఈడీఎల్ఐ‌) బీమా పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రావిడెంట్‌ ఫండ్‌(పీఎఫ్)ఖాతాదారుడు మరణిస్తే వారి చట్టపరమైన వారసులు లేదా నామినీకి రూ.7 లక్షల వరకు ప్రయోజనాలు అందుతాయి. అయితే ఇవి పొందాలంటే ఈ- నామినేషన్‌ తప్పనిసరి. అవసరమైతే గతంలో ఇచ్చిన నామినీ పేరును మార్చుకోవచ్చు. ఇదివరకు నామినేషన్‌ కోసం కార్యాలయానికి వెళ్లి నేరుగా దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు సులభంగా ఆన్‌లైన్‌ సేవలను వినియోగించుకోవచ్చు. నామినీని మార్చుకోవాలనుకున్నప్పుడు, వివాహం తరవాత దీనిని పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. అయితే ఇందులో నమోదు చేసిన పేరునే తుది నామినీగా పరిగణిస్తారు.  ఈ విధానం ద్వారా సభ్యుడి మరణానంతరం ఆధార్‌తో అనుసంధానించిన మొబైల్‌ నంబరుకు ఓటీపీ వస్తుంది. దీంతో బీమా సొమ్మును పొందడం తేలికవుతుంది.

ఆన్‌లైన్‌లో నామినేషన్‌ దాఖలు చేసే విధానం..

1. ముందుగా ఆన్‌లైన్‌లో ఈపీఎఫ్‌వో పోర్టల్‌ను తెరవాలి.

2. అందులో ‘సర్వీసెస్‌’ విభాగానికి వెళ్లి ‘ఫర్‌ ఎంప్లాయీస్‌’ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

3. ఆ తరవాత మెంబర్‌ ‘యూఏఎన్‌/ఆన్‌లైన్‌ సర్వీసెస్‌’బటన్‌ను క్లిక్‌ చేయాలి.

4. ఇక్కడ మీ యూఏఎన్‌ పాస్‌వర్డ్‌తో లాగిన్‌ అవ్వాలి.

5. ‘మ్యానేజ్‌’ అనే ట్యాబ్‌ కింద కనిపించే ‘ఈ నామినేషన్‌’పై క్లిక్‌ చేయాలి.

6. మీ ఫ్యామిలీ డిక్లరేషన్‌ కోసం ‘యస్‌’పై క్లిక్‌ చేయాలి.

7.‘యాడ్‌ ఫ్యామిలీ’ని ఎంచుకుని నామినీ వివరాలు నమోదు చేయాలి. (ఒకరికన్నా ఎక్కువ మందిని యాడ్‌ చేయవచ్చు)

8.‘నామినేషన్‌ డీటెయిల్స్‌’ పై క్లిక్‌ చేసి ఎవరెవరికి ఎంత మొత్తం ఇవ్వాలో తెలియజేయాలి.

9. ‘సేవ్‌ ఈపీఎఫ్ నామినేషన్‌’పై క్లిక్‌ చేయాలి.

10. ఇక్కడ ‘ఈ సైన్‌’జనరేట్‌ చేసే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

11. మీ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబరుకు వచ్చే ఓటీపీని అందులో ఎంటర్‌ చేస్తే ఈ ప్రక్రియ విజయవంతమవుతుంది. 

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని