Health News: మనిషిని కుప్పకూల్చే వడదెబ్బ

చెట్టంత మనిషిని కూడా భానుడి ఉష్ణం కుప్పకూల్చేస్తుంది. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థను దెబ్బతీస్తుంది.

Updated : 10 Aug 2022 11:15 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ : చెట్టంత మనిషిని కూడా భానుడి ఉష్ణం కుప్పకూల్చేస్తుంది. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థను దెబ్బతీస్తుంది. ఎండాకాలం వచ్చిందంటే చిన్నాపెద్దా తేడా లేకుండా వడదెబ్బ బారిన పడిపోతారు. శరీరంలోని నీటిని పీల్చేసి శక్తీహీనులుగా మార్చే వడదెబ్బ నుంచి ఎలా రక్షణ పొందాలో తెలుసుకుందాం.

* తీవ్రమైన ఎండలు, వడగాలులతో సహజంగానే మన ఒంట్లోని బలం బయటకు పోతుంది. 

* తీక్షణమైన ఉష్ణోగ్రత కారణంగా కఫం ప్రకోపిస్తుంది. ఫలితంగా జఠరాగ్ని మందగిస్తుంది.

* ఎవరికైనా వడదెబ్బ తగిలినపుడు ఆ వ్యక్తిని చల్లని వాతావరణంలోకి తీసుకెళ్లాలి.

* ఒంటిపై దుస్తులను వదులుగా చేసి గాలి బాగా ఆడేలా చూడాలి.

* నీరు, ద్రవాహారాలను బాగా అందించాలి.

* ద్రవ ఆహారాలను ఒక్కొక్కటిగా కాకుండా మిశ్రమంగా ఇస్తే బాగుంటుంది.

* కొబ్బరినీరు, చెరుకు రసాలు, పెరుగు, మజ్జిగ, పళ్లరసాలు వడదెబ్బ నుంచి రక్షణ కల్పిస్తాయి.

* వేసవిలో విరివిగా లభించే మామిడి పూత వడదెబ్బకు చక్కని ఔషధం. మామిడి పూలు ఒక కిలో, మామిడికాయలు ఉడికించి తీసిన గుజ్జు ఒక కిలో, చక్కెర 2 కిలోలు తీసుకొని అన్నింటిని కలిపి సన్నటి మంటపై ఉడికించాలి. 

* ఈ మిశ్రమం పాకంగా మారే సమయంలో మిరియాల పొడి 10 గ్రాములు, సైంధవ లవణం 10 గ్రాములు పాకం దించే సమయంలో పోయాలి.

* శుభ్రమైన గాజు సీసాలో భద్రపరచాలి. కుండలోని చల్లని నీరు గ్లాసు తీసుకొని అందులో రెండు చెంచాల పానకం పోసుకొని తాగాలి.

* ప్రతి రోజు ఈ పానకం తాగడంతో ఉష్ణతాపం, కళ్లమంట కూడా తగ్గిపోతుంది. ఆకలి లేకపోవడం, నోరు ఎండిపోవడానికి కూడా చక్కని పరిష్కారం చూపుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని