Appendicitis: అపెండిసైటీస్‌ రాకుండా ఇలా చేయొచ్చు..!

24 గంటల కడుపునొప్పి అంటే అందరికీ భయమే..చికిత్స అందించకపోతే ప్రాణాలే పోతాయని ఆందోళన చెందుతారు. తీవ్రంగా బాధించే ఈ అపెండిసైటీస్‌ కడుపునొప్పిని ఆపరేషన్‌ లేకుండా ఇపుడు మందులతో కూడా తగ్గిస్తున్నారు. అసలు ఇంతదాకా రాకుండా యోగాలోని కొన్ని ఆసనాలు చేస్తే అపెండిక్స్‌ రాకుండా ఉంటుందని యోగా నిపుణులు చెబుతున్నారు.

Updated : 18 Aug 2022 14:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: 24 గంటల కడుపునొప్పి అంటే అందరికీ భయమే..చికిత్స అందించకపోతే ప్రాణాలే పోతాయని ఆందోళన చెందుతారు. తీవ్రంగా బాధించే ఈ అపెండిసైటీస్‌ కడుపునొప్పిని ఆపరేషన్‌ లేకుండా ఇప్పుడు మందులతో కూడా తగ్గిస్తున్నారు. అసలు ఇంతదాకా రాకుండా కొన్ని ఆసనాలు చేస్తే ఇది రాకుండా ఉంటుందని యోగా నిపుణులు చెబుతున్నారు. అపెండిసైటీస్‌ బాధలను నివారించడానికి చేసే యోగాసనాలు, వాటి తీరుతెన్నులను యోగానిపుణులు ఆర్‌.ఆర్‌ ప్రసాద్‌ వివరించారు. అపెండిక్స్‌లో మలినాలు, బ్యాక్టీరియా చేరడంతో వాపు వస్తుంది. దాంతో తీవ్రమైన నొప్పి మొదలవుతుంది. అలాంటి మలినాలు చేరకుండా ఈ యోగాసనాలు బాగా ఉపయోగపడుతాయి.

వృక్షాసనం

వృక్షాసనం చేయడంతో పొట్టలో చేరిన మలినాలను పారదోలుతుంది. ఆసనం 20 సెకన్ల పాటు చేయాలి. ఇలా మనకు అనుకూలంగా అనిపించినంత సేపు చేసుకోవచ్చు.

త్రికోణాసనం

ఈ ఆసనం చేయడంతో జీర్ణ వ్యవస్థను సరళీకృతం చేస్తుంది. ఎలాంటి ఇబ్బందులున్నా తొలగిపోతాయి. కడుపులో నొప్పి రాకుండా ఉంటుంది. 

వాయుముద్ర

పద్మాసనం, కుర్చీలో గానీ చేయవచ్చు. శరీర భాగంలోని నొప్పిని తొలగిస్తుంది. 10 నిమిషాల పాటు చేసిన తర్వాత కొంత వ్యవధి  తీసుకొని మళ్లీ చేయవచ్చు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని