Vizag: హిందుస్థాన్ షిప్ యార్డుకు మరో భారీ కాంట్రాక్టు
హిందుస్థాన్ షిప్ యార్డ్‌కి రూ.934 కోట్లతో భారీ కాంట్రాక్టు లభించింది. ఈ మేరకు జరిగిన ఒప్పందంపై సంతకాలు చేశారు.
విశాఖపట్నం: ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ (Hindustan Shipyard)కి మరో భారీ కాంట్రాక్టు దక్కింది. నౌకాదళానికి చెందిన జలాంతర్గామి రీఫిట్ కాంట్రాక్టును రక్షణ మంత్రిత్వ శాఖ హెచ్ఎస్ఎల్ (HSL)కి అప్పగించింది. ఈ మేరకు ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ ఒప్పందంతో ఆత్మ నిర్భర్ భారత్ సాధనలో మరో కీలక అడుగు పడినట్టయింది. నౌకాదళంలో ఉన్న డీజిల్ ఎలక్ట్రిక్ మూడో సబ్ మెరైన్ సింధుకీర్తి. దీనిని సాధారణ రీఫిట్‌ను చేసేందుకు రూ.934 కోట్ల రూపాయిల విలువైన ఆర్ధర్‌ను షిప్ యార్డ్‌కి అప్పగించారు.
రీఫిట్ ద్వారా ప్రత్యామ్నాయ మరమ్మతుల వ్యవస్థ అభివృద్ధి అవుతుంది. నిర్దేశిత కాలం పని చేసిన తర్వాత రీఫిట్ చేయడం ద్వారా వాటి పని సామర్థ్యం తగ్గకుండా, మరింత సమర్థంగా వ్యవస్థలన్నీ మెరుగ్గా నిరంతరాయంగా పనిచేసేందుకు వీలవుతుంది. ఇందులో దాదాపు 20కి పైగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల సేవలను హెచ్‌ఎస్ఎల్ వినియోగించుకోనుంది. మీడియం రీఫిట్ లైఫ్ సర్టిఫికేషన్‌ను హెచ్ఎస్ఎల్ అందించనుంది. వెయ్యి రోజుల పని దినాలను ఉపాధి కల్పనను ఈ ప్రాజెక్టు సమయంలో చిన్న మధ్య, సూక్ష్మ తరహా పరిశ్రమలకు దక్కనుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Pakistan: బడ్జెట్ ప్రవేశపెట్టిన పాక్.. సగం అప్పులకే కేటాయింపు!
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (10/06/23)
-
India News
Manipur: మణిపుర్లో మరోసారి ఉగ్రవాదుల కాల్పులు.. విచారణ ప్రారంభించిన సీబీఐ!
-
Movies News
RRR: ఎన్టీఆర్-రామ్‌చరణ్‌లతో నటించే అవకాశం వస్తే అది అదృష్టమే: హాలీవుడ్ స్టార్ హీరో
-
Sports News
WTC Final: కెన్నింగ్టన్ ఓవల్‌లో మూడో హాఫ్ సెంచరీ.. డాన్ బ్రాడ్‌మన్ సరసన శార్దూల్
-
Politics News
Sachin Pilot: సచిన్ పైలట్ కొత్త పార్టీపై వస్తున్నవి రూమర్లే.. కాంగ్రెస్