
KTR: లండన్‌లో కేటీఆర్‌కు ఘన స్వాగతం.. ప్రత్యేక ఆకర్షణగా నంబర్ ప్లేట్
ఇంటర్నెట్ డెస్క్: విదేశీ పర్యటనలో భాగంగా యూకే వెళ్లిన తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు లండన్‌లో ఘనస్వాగతం లభించింది. అక్కడి విమానాశ్రయంలో ఎన్ఆర్ఐ తెరాస-యూకే విభాగంతో పాటు అనేక ఎన్ఆర్ఐ సంఘాలు ఆయనకు స్వాగతం పలికాయి. కేటీఆర్‌కు స్వాగతం పలికేందుకు వచ్చిన వందలాది మందితో ఎయిర్‌పోర్ట్‌లో కోలాహలం నెలకొంది. అనేక మంది తమ కుటుంబ సభ్యులతో ఎయిర్‌పోర్ట్‌కు చేరుకొని.. కేటీఆర్‌తో ఫొటోలు తీసుకొనేందుకు ఉత్సాహం చూపించారు. కేటీఆర్ ఇవాళ అనేక రంగాలకు చెందిన పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. తెలంగాణ, ఏపీకి చెందిన బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ కూడా కేటీఆర్‌కు స్వాగతం పలికారు.
కేటీఆర్ లండన్ పర్యటన సందర్భంగా ఓ కారు నంబర్ ప్లేట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. టీఆర్ఎస్ కేటీఆర్ అని కనిపించేలా నంబర్ ప్లేట్ ఉన్న కారు వద్ద దిగిన ఫొటోను కేటీఆర్ ట్విటర్ వేదికగా పంచుకున్నారు. ఆ ప్రత్యేక నెంబర్ ప్లేట్ ఉన్న కారులో రైడ్‌కు తీసుకెళ్లినందుకు ఎన్ఆర్ఐ తెరాస నేత అశోక్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. యూకే పర్యటన అనంతరం కేటీఆర్ దావోస్ వెళ్లనున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Business News
Stock Market Update: లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
-
Movies News
Anveshi Jain: ‘సీసా’ తో షేక్ చేస్తున్న అన్వేషి జైన్.. హుషారు వెనక విషాదం ఇదీ!
-
General News
Gudipudi Srihari: సీనియర్ పాత్రికేయుడు గుడిపూడి శ్రీహరి కన్నుమూత
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Ts-top-news News
Hyderabad News: రోజూ ‘బయోమెట్రిక్’ వేసి వెళ్తే నెలకు రూ. 15 వేలు!
-
Ap-top-news News
Raghurama: రఘురామ ఇంట్లోకి ప్రవేశించే యత్నంలో దొరికిపోయిన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Upasana: ‘ఉపాసన.. పిల్లలెప్పుడు’.. అని అడుగుతున్నారు.. సద్గురు సమాధానం
- IND vs ENG : మొత్తం మారిపోయింది
- Vishal: ఫైట్ సీన్స్ చేస్తుండగా కుప్పకూలిన హీరో విశాల్
- Raghurama: రఘురామ ఇంట్లోకి ప్రవేశించే యత్నంలో దొరికిపోయిన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్!
- Emirates: గాల్లో విమానానికి రంధ్రం.. అలాగే 14 గంటల ప్రయాణం!
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (05/07/22)
- Hyderabad News: సాఫ్ట్వేర్ ఇంజినీర్ హత్యకు రూ.4.50 లక్షల సుపారీ!
- Viral video: రియల్ హీరో.. కరెంటు షాక్‌తో విలవిల్లాడుతున్న ఆవును రక్షించిన యువకుడు
- Kaali: ‘కాళీ’ డాక్యుమెంటరీ పోస్టర్ వివాదాస్పదం.. దర్శకురాలిపై మండిపడుతోన్న నెటిజన్లు
- ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తే ఆత్మహత్యలే