Telangana News: 100శాతం సిలబస్‌తో ఈ ఏడాది ఇంటర్‌ పరీక్షలు: నవీన్‌మిత్తల్‌

ఇంటర్‌లో ఈ విద్యాసంవత్సరం 100శాతం సిలబస్‌తో వార్షిక పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌ తెలిపారు.

Published : 15 Oct 2022 01:48 IST

హైదరాబాద్‌: ఇంటర్‌లో ఈ విద్యాసంవత్సరం 100శాతం సిలబస్‌తో వార్షిక పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌ తెలిపారు. కొవిడ్‌ కారణంగా గత రెండేళ్లు 70శాతం సిలబస్‌తో పరీక్షలు నిర్వహించినట్టు చెప్పారు. సిలబస్‌, నమూనా ప్రశ్నపత్రాలు ఇంటర్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు.   

24 నుంచి ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ తరగతులు

ఎంటెక్‌, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌ మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తయిందని నవీన్‌ మిత్తల్‌ వెల్లడించారు. 5,556 ఎంటెక్ సీట్లలో మొదటి విడతలో 2,522 సీట్లు భర్తీ చేసినట్టు చెప్పారు. 3,106 ఎంఫార్మసీ సీట్లలో మొదటి విడతలో 2,163 సీట్లు భర్తీ చేశామన్నారు. 153 ఎంఆర్క్ సీట్లలో మొదటి విడతలో 46 సీట్లు భర్తీ అయ్యాయని తెలిపారు. ఈనెల 19 వరకు కాలేజీల్లో రిపోర్టు చేయాలని, ఈనెల 24 నుంచి ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ తరగతులు నిర్వహిస్తామని నవీన్‌ మిత్తల్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు