Viral Video: ప్రాణాలకు తెగించి భార్యను కాపాడిన భర్త

మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం దొరవారి తిమ్మాపురం గ్రామంలో ప్రాణాలకు తెగించి భర్త... భార్యను రక్షించాడు.

Published : 18 Aug 2021 01:43 IST

మహబూబాబాద్: మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం దొరవారి తిమ్మాపురం గ్రామంలో ప్రాణాలకు తెగించి భర్త... భార్యను రక్షించాడు. సుభద్ర అనే మహిళ సోమవారం ఉదయం మొక్కజొన్న చేను వద్దకు కాపలాగా వెళ్లారు. వాగు ప్రవాహం తక్కువగా ఉండగా.. సాయంత్రం ఇంటికి వస్తుండగా ఉద్ధృతి పెరిగింది. అవతలి ఒడ్డుకు చేరుకోలేక చిక్కుకుపోయింది. విషయం తెలిసిన భర్త విజయ్ .. భార్యను ఎలాగైనా తీసుకురావాలని గ్రామస్థుల సహకారం కోరాడు. రెండు ఒడ్డులకు మధ్య తాడు కట్టారు. ప్రమాదకరంగా ఉన్న వాగును ఈదుతూ అవతలి ఒడ్డుకు చేరాడు. భార్యను తాడు సాయంతో క్షేమంగా ఇవతలికి ఒడ్డుకు చేర్చాడు. భార్యను క్షేమంగా తీసుకొచ్చిన భర్త విజయ్ ను గ్రామస్థులు అభినందించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని