Trivikram: త్రివిక్రమ్‌ కారుకు ఫైన్‌ వేసిన పోలీసులు

దర్శకుడు త్రివిక్రమ్‌ కారుకు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు చలానా విధించారు. సోమవారం ఉదయం జూబ్లీహిల్స్‌ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్న పోలీసులు.. అటుగా వెళ్తున్న త్రివిక్రమ్‌ శ్రీనివాస్...

Updated : 04 Apr 2022 14:15 IST

హైదరాబాద్‌: దర్శకుడు త్రివిక్రమ్‌ కారుకు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు చలానా విధించారు. సోమవారం ఉదయం జూబ్లీహిల్స్‌ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేసిన పోలీసులు.. అటుగా వెళ్తోన్న త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కారుని ఆపారు. ఆయన కారుకు ఉన్న బ్లాక్‌ ఫిల్మ్‌ తొలగించి జరిమనా విధించారు. ఆ సమయంలో త్రివిక్రమ్‌ కారులోనే ఉన్నారు. వాహనాలకు ఉన్న బ్లాక్‌ ఫిల్మ్‌లను తొలగించాలని కొన్నిరోజులుగా ట్రాఫిక్‌ పోలీసులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అలా తొలగించని వారి వాహనాలకు జరిమానా విధిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల మంచు మనోజ్‌, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, కల్యాణ్‌రామ్‌ కార్లకు ఉన్న బ్లాక్‌ ఫిల్మ్‌లను పోలీసులు తొలగించి ఫైన్‌ వేసిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని