Sandeep Sandilya: హైదరాబాద్‌ సీపీ సందీప్ శాండిల్యకు అస్వస్థత

హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ (సీపీ) సందీప్ శాండిల్య (Sandeep Sandilya) అస్వస్థతకు గురయ్యారు.

Updated : 20 Nov 2023 18:03 IST

హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ (సీపీ) సందీప్ శాండిల్య (Sandeep Sandilya) అస్వస్థతకు గురయ్యారు. బషీర్‌బాగ్‌ పాత సీపీ కార్యాలయంలో ఉండగా సందీప్‌ శాండిల్య ఛాతీనొప్పితో ఇబ్బంది పడ్డారు. దీంతో ఆయనను అధికారులు హుటాహుటిన హైదర్‌గూడలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శాండిల్య ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఆస్పత్రిలో సందీప్‌ శాండిల్యను సీఐడీ చీఫ్‌ మహేశ్‌ భగవత్‌ పరామర్శించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని సందీప్‌ శాండిల్య తెలిపారు. ఒకరోజు పర్యవేక్షణలో ఉండాలని వైద్యులు సూచించినట్లు పేర్కొన్నారు. మంగళవారం యథావిధిగా విధులకు హాజరవుతానని శాండిల్య వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని