Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రో.. రద్దీ వేళల్లో రాయితీ రద్దు

నగరవాసులకు హైదరాబాద్‌ మెట్రో భారం విధించనుంది. ఏప్రిల్ 1 నుంచి మెట్రో రాయితీలలో కోత విధించనున్నట్లు మెట్రో అధికారులు వెల్లడించారు.

Updated : 31 Mar 2023 16:16 IST

హైదరాబాద్‌: నగరవాసులకు హైదరాబాద్‌ మెట్రో రాయితీల్లో కోత విధించనుంది. ఏప్రిల్ 1 నుంచి మెట్రో రాయితీల్లో కోత విధించనున్నట్లు మెట్రో అధికారులు వెల్లడించారు. రద్దీ వేళల్లో డిస్కౌంట్‌ను పూర్తిగా ఎత్తివేయనున్నట్లు తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకూ... రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకూ మాత్రమే రాయితీ వర్తిస్తుందని పేర్కొన్నారు. మెట్రో కార్డు, క్యూఆర్‌ కోడ్‌పై ఇప్పటి వరకు ప్రయాణ ఛార్జీల్లో 10శాతం డిస్కౌంట్ ఉండేది.

అదేవిధంగా సూపర్ సేవర్ హాలీడే కార్డ్ ఛార్జీని భారీగా పెంచనున్నట్లు మెట్రో అధికారులు ప్రకటించారు. సెలవు రోజుల్లో ప్రయాణించే హాలిడే కార్డు రూ.59గా ఉన్న ధరను రూ.99కి పెంచనున్నారు. గతంలో రూ.59లతో కార్డు తీసుకున్న వారు... సూపర్ సేవర్ రూ.99 రీఛార్జ్‌ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. కానీ, కొత్తగా తీసుకునే వారు మాత్రం రూ.100 చెల్లించాలని చెప్పారు. అలాగే కాంటాక్ట్ లెస్ స్మార్ట్ కార్డుల ధరను భారీగా పెంచనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని