HYD: అమీర్‌పేట్‌ - రాయదుర్గం మార్గంలో యాథావిధిగా మెట్రో రాకపోకలు

హైదరాబాద్ మెట్రో రైలులో తలెత్తిన సాంకేతిక సమస్యను మెట్రో రైల్‌ అధికారులు పరిష్కరించారు. దాదాపు అరగంట తర్వాత సాంకేతిక సమస్యను పరిష్కరించడంతో అమీర్‌పేట్‌ - రాయదుర్గం మార్గంలో రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి.

Updated : 24 Jan 2023 16:40 IST

హైదరాబాద్‌: మెట్రో రైలులో తలెత్తిన సాంకేతిక సమస్యను అధికారులు పరిష్కరించారు. అమీర్‌పేట్‌ - రాయదుర్గం మార్గంలో సాంకేతిక లోపం కారణంగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో రాయదుర్గం - అమీర్‌పేట్‌ ఒకవైపు మార్గంలోనే రైళ్ల రాకపోకలు సాగించారు. ఒకే రూట్‌లో రాకపోకలు సాగించడంతో మెట్రో రైళ్లు ఆలస్యంగా నడిచాయి. సంబంధిత కారిడార్‌లో అధికారులు సరైన సమాచారం ఇవ్వకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. అమీర్‌పేట్‌ మెట్రో స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. దాదాపు అరగంట తర్వాత సాంకేతిక సమస్యను పరిష్కరించడంతో అమీర్‌పేట్‌ - రాయదుర్గం మార్గంలో రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని