Hyderabad Police: ‘సామూహిక జనగణమన’.. ఆన్లైన్ కనెక్టివిటీతో సక్సెస్
స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర మొత్తం ‘జనగణమన’తో మారుమోగింది.
హైదరాబాద్: స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర మొత్తం ‘జనగణమన’తో మారుమోగింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని అన్ని కూడళ్ల వద్ద ఉదయం 11.30 గంటలకు జాతీయ గీతాలాపన జరిగింది. సాంకేతికత సాయంతో నగరంలో ఈ కార్యక్రమం విజయవంతమయ్యేందుకు ట్రాఫిక్ పోలీసులు కీలకంగా వ్యవహరించారు.
డిజిటల్ అనౌన్స్మెంట్ సిస్ట్మ్లో భాగంగా ఆన్లైన్ కనెక్టివిటీ ఉన్న అన్ని సిగ్నల్ పాయింట్లలో ‘జనగణమన’ ప్లే అయింది. దీనికోసం కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముందస్తుగా ప్రోగ్రాం చేసి 11:29:30 గంటలకు దాన్ని విడుదల చేశారు. తొలుత ‘అందరూ దయచేసి నిలబడండి.. జాతీయ గీతాలాపన చేద్దాం’ అనే సందేశాన్ని వినిపించారు. ఆ తర్వాత రెండు సైరన్లు మోగిన అనంతరం జాతీయ గీతం ప్లే అయింది. మూడు కమిషనరేట్ల పరిధిలో ఆన్లైన్లో అనుసంధానమైన కూడళ్ల వద్ద రెడ్ సిగ్నల్ పడి ‘జనగణమన’ గీతం వచ్చేలా కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రోగ్రాం చేశారు. ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తయినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..