hyderabad news: ఈనెల 13 నుంచి హైదరాబాద్‌ సెయిలింగ్‌ వీక్‌

నగరంలోని హుస్సేన్‌ సాగర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే హైదరాబాద్‌ సెయిలింగ్‌ వీక్‌ త్వరలో ప్రారంభం కానుంది.  ఈనెల 13 నుంచి 19 వరకు జరిగే సెయిలింగ్‌ వీక్‌లో..

Updated : 02 Aug 2021 06:07 IST

హైదరాబాద్‌: నగరంలోని హుస్సేన్‌ సాగర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే హైదరాబాద్‌ సెయిలింగ్‌ వీక్‌ త్వరలో ప్రారంభం కానుంది.  ఈనెల 13 నుంచి 19 వరకు జరిగే సెయిలింగ్‌ వీక్‌లో దేశ నలుమూలల నుంచి క్రీడాకారులు పాల్గొననున్నారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు మిలటరీ కాలేజ్‌ ఆప్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ మెకానికల్‌, లేజర్‌ క్లాస్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో కోచింగ్‌ క్యాంపును ప్రారంభించారు.  ఆగస్టు 1 నుంచి 11వరకు నిర్వహించే కోచింగ్‌ క్యాంపును ఎంఎస్‌ఎంఈ లెఫ్టినెంట్‌ జనరల్‌ నారాయణన్‌ ప్రారంభించారు. ఈనెల 13 నుంచి జరగబోయే సెయిలింగ్‌ వీక్‌ను గవర్నర్‌ తమిళిసై చేతుల మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని