Chandrababu: సీఎం చంద్రబాబును కలిసేందుకు వివాదాస్పద అధికారుల ప్రయత్నాలు

ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు క్యూ కట్టారు.

Updated : 13 Jun 2024 17:51 IST

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు క్యూ కట్టారు. గత ప్రభుత్వ హయాంలో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న అజయ్‌ జైన్‌, శ్రీలక్ష్మి, పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, సునీల్‌ కుమార్‌, కేవీవీ సత్యనారాయణ తదితరులు.. చంద్రబాబు రాగానే సచివాయలం మొదటి బ్లాక్‌ వద్దకు పరుగులు పెట్టారు. గతంలో ఆయనకు వ్యతిరేకంగా అజయ్ జైన్‌.. సీఐడీకి స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా కుట్రలు పన్నిన నాటి ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా పనిచేసిన పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు పూర్తి స్థాయిలో సహకరించారనే అభియోగాలు ఉన్నాయి. జగన్‌, సీఎంవో అధికారులతో కుమ్మక్కై పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని మున్సిపల్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన శ్రీలక్ష్మిపై ఆరోపణలున్నాయి. ఆర్థికశాఖలో భారీగా అవకతవకలకు పాల్పడ్డారని కేవీవీ సత్యనారాయణపై అభియోగాలున్నాయి. వివాదాస్పద అధికారులు చంద్రబాబును కలిసేందుకు ముఖ్యమంత్రి కార్యాలయం అనుమతించకపోవడంతో వెనుదిరిగినట్టు సమాచారం. కాసేపట్లో ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులతో సీఎం సమావేశం కానున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని