భౌతిక దూరం పాటించకుంటే విధ్వంసమే..

కరోనా మహమ్మారి నుంచి భౌతిక దూరం మనల్ని ఎలా మనల్ని రక్షిస్తుందో చూపిస్తూ పెద్దపల్లి జిల్లా రామగుండానికి చెందిన ఐఏఎస్‌ అధికారి నరహరి చేసిన ట్వీట్‌ సందేశాత్మకంగా ఉంది....

Published : 19 Apr 2021 11:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా రెండో దశ దేశవ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. కొద్ది రోజులుగా రెండు లక్షలకు పైనే కొవిడ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం సామాజిక దూరం పాటించకపోవడమేనని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే కరోనా మహమ్మారి నుంచి భౌతిక దూరం ఎలా మనల్ని రక్షిస్తుందో చూపిస్తూ పెద్దపల్లి జిల్లా రామగుండానికి చెందిన ఐఏఎస్‌ అధికారి నరహరి చేసిన ట్వీట్‌ సందేశాత్మకంగా ఉంది. మధ్యప్రదేశ్‌ మార్క్‌ఫెడ్‌ ఎండీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నరహరి భౌతిక దూరం పాటించకుంటే ఎంతటి విధ్వంసం జరుగుతుందో కళ్లకు కట్టినట్లు వీడియోలో చూపించారు. భౌతిక దూరం పాటిస్తే వైరస్‌ ఎలా బలహీనపడుతుందో అందులో పేర్కొన్నారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని