సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి గోపాలకృష్ణ ద్వివేది బదిలీ

సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఇటీవల వ్యవసాయ, గనుల శాఖ నుంచి ఆయన్ను కార్మిక శాఖకు బదిలీ చేసిన విషయం తెలిసిందే.

Updated : 24 Jun 2024 22:40 IST

అమరావతి: సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఇటీవల వ్యవసాయ, గనుల శాఖ నుంచి ఆయన్ను కార్మిక శాఖకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. అయితే, కార్మికశాఖ బాధ్యతలు అప్పగించడంపై పాలనావర్గాల్లో విస్మయం వ్యక్తమైనట్లు సమాచారం. గ్రామ, వార్డు సచివాలయాలకు పార్టీ రంగుల విషయంలో ఆయన విమర్శలు ఎదుర్కొన్నారు.అంతేకాకుండా మాజీ మంత్రి పెద్దిరెడ్డి అక్రమాలకు పూర్తిగా సహకరించారనే ఆరోపణలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ద్వివేదిని జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులుజారీ అయ్యాయి. దీంతో కార్మికశాఖ కార్యదర్శి నాయక్‌కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని