Telangana news: తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శిగా కరుణ

తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. ఆరుగురు అధికారులను బదిలీ/అదనపు బాధ్యతలు అప్పగిస్తూ......

Updated : 19 May 2022 19:34 IST

హైదరాబాద్‌: తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. ఆరుగురు అధికారులను బదిలీ/అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర అదనపు ఎన్నికల ప్రధానాధికారిగా ఉన్న డా.జ్యోతి బుద్ధప్రకాశ్‌ను చేనేత, జౌళి, హస్తకళల కార్యదర్శిగా బదిలీ చేసింది. అలాగే, ఆయనకు రవాణాశాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. సీఎం కార్యదర్శి రాహుల్‌ బొజ్జాను రిజిస్ట్రేషన్లు, స్టాంపుల కమిషనర్‌గా, సర్వే సెటిల్మెంట్, భూ రికార్డుల డైరెక్టర్, భూభారతి పీడీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. అలాగే, ఆరోగ్యశాఖ కమిషనర్‌గా ఉన్న వాకాటి కరుణను విద్యాశాఖ కమిషనర్‌గా బదిలీ చేసిన ప్రభుత్వం.. వైద్యశాఖ కార్యదర్శి రిజ్వీకి ఔషధ నియంత్రణ సంచాలకులుగా, ప్రజారోగ్య - కుటుంబసంక్షేమశాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలను అప్పించింది. సీఎం కార్యదర్శిగా ఉన్న వి.శేషాద్రిని సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) కార్యదర్శిగా, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియాను యువజన సర్వీసులు, పర్యాటకశాఖ కార్యదర్శిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఉత్తర్వులు ఇచ్చారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని