ICAI CA exam results: సీఏ ఫౌండేషన్ పరీక్ష ఫలితాల కోసం క్లిక్ చేయండి
ఛార్టెర్డ్ అకౌంటెంట్స్ (సీఏ) ఫౌండేషన్(ICAI CA Foundation) పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలు ఇలా తెలుసుకోవచ్చు.
దిల్లీ: గతేడాది డిసెంబర్‌లో జరిగిన ఛార్టెర్డ్ అకౌంటెంట్స్ (సీఏ) ఫౌండేషన్(ICAI CA Foundation) పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ICAI) సంస్థ శుక్రవారం ఈ ఫలితాలను వెల్లడించింది. అభ్యర్థులు తమ అధికారిక వెబ్‌సైట్ icai.nic.inలో ఫలితాలను తెలుసుకోవచ్చని పేర్కొంది. ఫలితాలను తెలుసుకొనేందుకు ఆయా అభ్యర్థులు తమ ఆరు అంకెల రోల్ నంబర్‌తో పాటు రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. గతేడాది డిసెంబర్ 14 నుంచి 20వ తేదీల మధ్య ఈ పరీక్ష జరిగిన విషయం తెలిసిందే.
మరోవైపు 2023 మే, జూన్ నెలల్లో జరిగే సీఏ ఫౌండేషన్, ఇంటర్మీడియట్, ఫైనల్ కోర్సుల పరీక్షల షెడ్యూల్‌ను ఐసీఏఐ ఇటీవలే ప్రకటించింది. సీఏ ఫౌండేషన్ కోర్సు పరీక్షలను జూన్ 24, 26, 28, 30 తేదీల్లో నిర్వహించనుండగా.. ఇంటర్మీడియట్ కోర్సులో గ్రూపు-1 పరీక్షలు మే 3, 6, 8, 10 తేదీల్లో; గ్రూపు-2ను 12, 14, 16, 18 తేదీల్లో నిర్వహిస్తున్నట్టు పేర్కొంది. ఫైనల్ విద్యార్థులకు గ్రూపు-1ను మే 2, 4, 7, 9 తేదీల్లో, గ్రూపు-2ను మే 11, 13, 15, 17 తేదీల్లో జరపనుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Andhra News: ఈ వృద్ధుడు.. మృత్యుంజయుడు
-
Ap-top-news News
Vande Bharat Express: సికింద్రాబాద్- తిరుపతి వందేభారత్ షెడ్యూల్ ఇదే..
-
Crime News
సురేశ్ రైనా అత్తామామల హత్యకేసు నిందితుడి ఎన్కౌంటర్
-
Ts-top-news News
ఉదయం ప్రజాప్రతినిధి.. మధ్యాహ్నం కూలీ
-
Sports News
ధోని కెప్టెన్సీ పేలవం: టీమ్ఇండియా మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్
-
Movies News
NTR: భయపెట్టేందుకు బరిలోకి ఎన్టీఆర్