ICSE: ఐసీఎస్‌ఈ 10, ఐఎస్‌సీ 12వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల

ఐసీఎస్‌ఈ, ఐఎస్‌సీ బోర్డు 10, 12వ తరగతి పరీక్షలకు షెడ్యూల్‌ విడుదలైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 27 నుంచి మార్చి 29 వరకు ఐసీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలు జగరనున్నాయి.

Published : 02 Dec 2022 01:34 IST

దిల్లీ: ఐసీఎస్‌ఈ, ఐఎస్‌సీ బోర్డు 10, 12వ తరగతి పరీక్షలకు షెడ్యూల్‌ విడుదలైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 27 నుంచి మార్చి 29 వరకు ఐసీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలు, ఫిబ్రవరి 13 నుంచి మార్చి 31వరకు ఐఎస్‌సీ 12వ తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్టు భారత పాఠశాల విద్య ధ్రువీకరణ పరీక్షల మండలి (CISCE) వెల్లడించింది. సబ్జెక్టుల వారీగా డేట్‌ షీట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ పరీక్షల ఫలితాలను 2023 మే నెలలో ప్రకటించనున్నట్టు సీఐఎస్‌సీఈ తెలిపింది. విద్యార్థులు పరీక్షకు ఐదు నిమిషాల ముందే పరీక్ష హాలులో కూర్చోవాలని సూచించింది. 

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని