Idupulapaya IIIT : ఆందోళనలు విరమించిన ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు

కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో మూడు రోజులుగా విద్యార్థులు చేస్తున్న ఆందోళన విరమించారు.

Updated : 23 Mar 2022 05:40 IST

కడప: కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో మూడు రోజులుగా విద్యార్థులు చేస్తున్న ఆందోళన విరమించారు. రెండు మూడు నెలల్లోగా విద్యార్థులు లేవనెత్తిన డిమాండ్లను అన్నిటినీ పరిష్కరిస్తామని ఆర్జీయూకేటీ ఛాన్స్‌లర్ కేసీ రెడ్డి హామీ ఇవ్వడంతో విద్యార్థులు ధర్నా విరమించారు. ట్రిపుల్ ఐటీలో ఉన్న  6వేల మంది విద్యార్థులకు సంఘీభావంగా ఒంగోలు నుంచి మరో 3 వేల మంది విద్యార్థులు వచ్చారు. ఒంగోలు నుంచి వచ్చిన  వారికి కొత్త క్యాంపస్‌లు కేటాయించి.. అక్కడ ఉన్న పీ1, పీ2 విద్యార్థులను పాత క్యాంపస్‌కు వెళ్లాలని అధికారులు ఆదేశించడంతో సమస్య మొదలైంది. అక్కడ సరైన మౌలిక సదుపాయాలు లేవని, విషపు పురుగులు సంచరిస్తున్నాయని పీ1, పీ2 విద్యార్థులు ఆందోళన చేపట్టారు. సమస్ పరిష్కరించేవరకు విద్యార్థులంతా కొత్త క్యాంపస్‌లోనే సర్దుకొని ఉండాలని కేసీ రెడ్డి సూచించారు. గదులు ఖాళీ లేకుండా ఎలా సర్దుకొని ఉండాలంటూ విద్యార్థులు వాపోతున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు