ప్రభుత్వం చెప్పకపోతే మేమే ఆదేశాలిస్తాం

తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. రాత్రి కర్ఫ్యూ తర్వాత కరోనా కట్టడి చర్యలు

Updated : 13 Jul 2021 19:44 IST

తెలంగాణ సర్కారుకు హైకోర్టు హెచ్చరిక

హైదరాబాద్‌ : తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. రాత్రి కర్ఫ్యూ తర్వాత కరోనా కట్టడి చర్యలు వెల్లడించకపోవడంపై న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. 45 నిమిషాల్లో వివరాలు తెలపాలని అడ్వొకేట్‌ జనరల్‌ను కోర్టు ఆదేశించింది. ప్రభుత్వం చెప్పకపోతే తామే ఆదేశాలిస్తామని న్యాయస్థానం హెచ్చరించింది. పాలనా విషయాల్లో జోక్యం చేసుకోవాలనుకోవడం లేదని ఈ సందర్భంగా హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం ఇటీవల విధించిన రాత్రి కర్ఫ్యూ ఆంక్షలు నేటితో ముగియనున్నప్పటికీ.. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని