Anand Mahindra: ఆదివారం వ్యాయామం చేయడానికి బద్ధకమా? ఆనంద్‌ మహీంద్రా చిట్కా!

సామాజిక మాధ్యమాల్లో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ తన ఫాలోవర్లకు ఏదో కొత్త విషయాన్ని తెలియజేసే మహీంద్రా అండ్‌ మహీంద్రా ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా మరో కొత్త చిట్కాతో మన ముందుకు వచ్చారు....

Published : 01 Aug 2021 12:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సామాజిక మాధ్యమాల్లో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ తన ఫాలోవర్లకు ఏదో కొత్త విషయాన్ని తెలియజేసే మహీంద్రా అండ్‌ మహీంద్రా ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా మరో కొత్త చిట్కాతో మన ముందుకు వచ్చారు. ఆదివారం వ్యాయామం చేయడానికి బద్ధికించే వారికోసం ఓ వీడియో పోస్ట్‌ చేశారు. తానూ ఈ కేటగిరీకే చెందినవాడినంటూ చమత్కరించారు. ఆదివారం వ్యాయామం చేయకపోయినా.. ఆ వీడియో చూస్తే చాలని సరదాగా వ్యాఖ్యానించారు. నిజంగా ఆ వీడియోలో జిమ్నాస్ట్‌లు చేస్తున్న విన్యాసాలు చూస్తుంటే ఏ వ్యాయామం చేయకపోయినా.. మనలో ప్రతి కండరం కదలిన భావం కలగడం ఖాయమనిపిస్తోంది!

‘‘రోజువారీ వ్యాయామ దినచర్యను ఆదివారమూ కొనసాగించేందుకు బద్ధకంగా ఫీలయ్యే రకానికి చెందినవారా మీరు? అయితే, ఒక పరిష్కారం ఉంది. నాలాగే మీరు ఈ వీడియో క్లిప్‌ను సేవ్‌ చేసుకోండి. కనీసం రెండుసార్లు చూడండి. చివరకు మీ శరీరంలోని ప్రతి కండరానికి వ్యాయామం చేసిన ఫీలింగ్‌ కలుగుతుంది. మీరు అలసిపోతారు’’ అని ట్విటర్‌లో మహీంద్రా రాసుకొచ్చారు. ఈ సందేశానికి ఆయన జత చేసిన వీడియో మీరూ చూసేయండి మరీ..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని