పక్షవాత రోగుల కోసం వినూత్న ఆవిష్కరణ!

గుజరాత్‌లోని గాంధీనగర్‌ ఐఐటీకి చెందిన మెకానికల్‌ విభాగానికి చెందిన బృందం ఓ వినూత్న ఆవిష్కరణకు రూపం పోసింది. మనిషికి పక్షవాతం లేదా ఇతర జబ్బు లక్షణాలు......

Published : 11 Oct 2020 01:08 IST

గాంధీనగర్‌: గుజరాత్‌లోని గాంధీనగర్‌ ఐఐటీకి చెందిన మెకానికల్‌ విభాగానికి చెందిన బృందం ఓ వినూత్న ఆవిష్కరణకు రూపం పోసింది. మనిషికి పక్షవాతం లేదా ఇతర జబ్బు లక్షణాలు మొదలైనపుడు నరాల వ్యవస్థ దెబ్బతిని నడక, మాటతీరు, విషయాల్ని అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. అలాంటి ఇబ్బందుల నుంచి మనిషిని తిరిగి సాధారణ స్థితికి ప్రేరేపించేలా చేసే రొబోటిక్‌ లెగ్‌ ఎక్సోస్కెలిటన్‌ అనే పరికరాన్ని రూపొందించారు. వినీత్‌ వశిష్ట అనే ప్రొఫెసర్‌ నేతృత్వంలో రూపొందించిన ఈ లెగ్‌ ఎక్సోస్కెలిటన్‌కు వారు ‘వియర్స్‌’ అని నామకరణం చేశారు. 

ఈ పరికరం గురించి ప్రొఫెసర్‌ వినీత్‌ మాట్లాడుతూ.. ‘‘సాధారణంగా పక్షవాతం వచ్చిన వారికి నరాల వ్యవస్థ దెబ్బతినడం వల్ల కదలికల్లో ఇబ్బందులు మొదలవుతాయి. నడవడానికి ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారి కోసమే లెగ్‌ ఎక్సోస్కెలిటన్‌ తయారు చేశాం. ఈ రొబోటిక్‌ పరికరాన్ని శరీరానికి బిగించడం ద్వారా.. మన శరీరంలోని కండరాల్ని కొంత బాహ్య శక్తి ద్వారా కదలికలకు ఉత్తేజపరుస్తాయి. దీన్ని ధరించి నడవడం ద్వారా మనిషి శరీర కదలికల్లో కొంతమేర అయినా సాధారణ స్థితిని తిరిగి పొందవచ్చు. ఇది చాలా తేలికగా ఉంటుంది. సులువుగా ధరించొచ్చు’’ అని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని