Jagan-Lotus Pond: లోటస్ పాండ్‌ వద్ద అక్రమ నిర్మాణాలు తొలగింపు

ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ హైదరాబాద్‌లోని నివాసం ముందున్న అక్రమ నిర్మాణాలను జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చివేశారు.

Updated : 15 Jun 2024 22:58 IST

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ హైదరాబాద్‌లోని నివాసం ముందున్న అక్రమ నిర్మాణాలను జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చివేశారు. లోటస్‌ పాండ్‌ వద్ద అక్రమంగా నిర్మించిన పోలీస్‌ సెక్యూరిటీ షెడ్లను జీహెచ్‌ఎంసీ తొలగించింది. రహదారికి అడ్డుగా ఉన్నాయన్న ఫిర్యాదుతో జీహెచ్‌ఎంసీ అధికారులు మూడు షెడ్లను కూల్చేశారు. అక్రమ నిర్మాణాలు తొలగించాలని లోటస్‌ పాండ్‌ సిబ్బందికి జీహెచ్ఎంసీ, పోలీసులు నిన్ననే ఆదేశాలు జారీ చేశారు.  రహదారి పక్కనే అక్రమ నిర్మాణాలతో రాకపోకలకు ఇబ్బందిగా మారిందని ఫిర్యాదు అందడంతో ఈ మేరకు చర్యలు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని