Hyderabad: హైదరాబాద్‌లో చిరుజల్లులు.. నగరవాసులకు ఉపశమనం

భాగ్యనగరంలో రానున్న గంటపాటు మొస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

Updated : 15 Apr 2022 18:32 IST

హైదరాబాద్: భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. నగరంలోని నాంపల్లి, కోఠి, సుల్తాన్ బజార్, కింగ్ కోఠి, బషీర్ బాగ్, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణగూడలో మోస్తరు వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్, చిలకలగూడ, పద్మారావు నగర్, మారెడ్‌పల్లి, బోయిన్‌పల్లి, బేగంపేటలో చిరు జల్లులు కురుస్తున్నాయి. పలు చోట్ల ఆకాశం మేఘావృతమై ఉంది. అక్కడక్కడా మోస్తరు వర్షం కురవడంతో నగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉక్కపోత నుంచి నగరవాసులకు ఉపశమనం లభించింది.

హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని.. నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని నగరవాసులకు సూచించింది. లోతట్టు ప్రాంతాల్లో నీటినిల్వ ఉండకుండా చూడాలని కింది స్థాయి సిబ్బందికి అధికారులు ఆదేశాలు సైతం జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని